అప్పటికీ ఇప్పటికీ అదే తేడా : రాజమౌళి

బాహుబలి చిత్రాలతో రాజమౌళి స్థాయి అమాంతం పెరిగిపోయింది. మన టాలీవుడ్‌ జక్కన్నకు ఈ మూవీతో జాతీయ స్థాయిలో యమా క్రేజ్‌ ఏర్పడింది. రాజమౌళి అనే బ్రాండ్‌ కనబడితే చాలు.. సినిమా హిట్టు అనేంతగా ప్రాచుర్యం పొందాడు. ఇంతవరకు అపజయం ఎరుగుని దర్శకధీరుడు రాజమౌళి… తన మొదటి సినిమా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కించిన స్టూడెంట్‌ నెం.1 తాలుకూ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆ మూవీ విడుదలై నేటికి సరిగ్గా 18 ఏళ్లు అయినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేశాడు.

‘స్టూడెంట్‌ నెం.1 రిలీజై 18 ఏళ్లు అయ్యాయి. అయితే అనుకోకుండా మేము మళ్లీ రామోజీ ఫిల్మ్‌సిటీలోనే ఉన్నాము. అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. తను సన్నగా అయ్యాడు.. నాకు కొంచెం వయసు పెరిగింది… అయితే మునుపటి కంటే ఇప్పుడు పరిణితి చెందాము’ అంటూ అప్పటి వర్కింగ్‌ స్టిల్‌, ఇప్పటి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర వర్కింగ్‌స్టిల్‌ను కలిపి పోస్ట్‌చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*