అలనాటి భాగ్యనగరంలో పవన్ కళ్యాణ్

పవన్‌ కళ్యాణ్- క్రిష్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ ముగిసింది. వచ్చేవారం మరో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యుల్ కోసం గండి కోట సెట్ ని రాజీవన్ నేతృత్వంలో డిజైన్ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం. చార్మినార్ సెట్ కూడా వేసిన సంగతి తెలిసిందే.చార్మినార్ ఒక్కటే కాదు.. హైదరాబాద్ లో ఉన్న చారిత్రాత్మక కట్టడాలన్నీ..ఈ సినిమా కోసం సెట్స్ రూపంలో మళ్లీ నిర్మించబోతున్నారు. ఒకప్పటి భాగ్యనరగరానికి పునసృష్టి చేస్తున్నారు.

ఈ సినిమా బడ్జెట్ లో ఎక్కువ బాగం సెట్స్ కోసమే ఖర్చుచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఎక్కువ సెట్స్ లో జరుపుకునే సినిమా కూడా ఇదే అని చెబుతున్నారు. అంతేకాదు ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు వెరీవెరీ స్పెషల్. ఇన్నేళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ పిరియాడిక్ మూవీ చేయలేదు. పవన్ నుండి వస్తున్న మొదటి పిరియాడిక్ మూవీ కావడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*