అలీ రీఎంట్రీ.. బిగ్‌బాస్‌పై నెటిజన్స్‌ ఫైర్‌

హౌస్‌మేట్స్‌కు సర్‌ప్రైజ్‌ ట్విస్ట్‌.. వెయిట్‌ అండ్‌ వాచ్‌ అంటూ విడదల చేసిన ఓ ప్రోమో.. ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అయితే అందులో ఉన్నది అలీ రెజా అని తెలిసిపోతూనే ఉంది. అలీ రెజా నామినేషన్స్‌లోకి వచ్చిన మొదటిసారే.. వెనుదిరిగిపోయాడు. అలీ ఎలిమినేషన్‌తో హౌస్‌మేట్స్‌తో పాటు ఆడియెన్స్‌ కూడా షాక్‌కు గురయ్యారు. అలీని తిరిగి బిగ్‌బాస్‌ ఇంట్లోకి తీసుకురావాలని అతని అభిమానులు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశారు.

అయితే నేటి ఎపిసోడ్‌లో అలీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోన్నట్లు విడుదల చేసిన ప్రోమో.. సోషల్‌మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. ఓటింగ్‌ ప్రక్రియ చేపట్టకుండా.. అలీని హౌస్‌లోకి ఎలా తీసుకువస్తారు? అంటూ నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు. అలీని తిరిగి ఇంట్లో ప్రవేశపెట్టాలని అందరూ కోరుకుంటున్నారు.. కానీ ఇలా ఇష్టం వచ్చినట్లు చేస్తే ఎలా అని అంటున్నారు.

ప్రజల కోరిక మేరకే ఎలిమినేషన్‌ జరిగింది. వారంతా సమయాన్ని వృథా చేసుకుంటూ ఓట్లు వేస్తూ షోను ఆదరిస్తున్నారు. ఇలా ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా.. ఓటింగ్‌ చేపట్టకుండా ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌ను ఎలా రీఎంట్రీ పేరిట తీసుకువచ్చి రుద్దుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రీఎంట్రీ కోసం ఓటింగ్‌ పెడితే.. వచ్చేది అలీరెజానే అని కొంతమంది అంటున్నారు.

కంటెస్టెంట్లను సెలెక్ట్‌ చేసేటప్పుడు ప్రజలను అడిగి చేస్తున్నారా? వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అప్పుడు ప్రజల అభిప్రాయాలను తీసుకుంటున్నారా? అంటూ ఇంకొంత మంది అలీ రీఎంట్రీని సపోర్ట్‌ చేస్తున్నారు. ఏదేమైనా.. కొన్నింటికి కొన్ని పద్దతులు ఉంటాయని వాటిని పాటించనక్కర్లేదా అని మరో వర్గం అసహనం వ్యక్తం చేస్తుంది. అలీ రీఎంట్రీ అనేది నిజమే అయితే.. ఓటింగ్‌ చేపట్టకుండా అలా చేసినందుకు బిగ్‌బాస్‌ షోను ఇక చూడమంటూ తెగేసి చెబుతున్నారు. మరి నేటి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో చూడాలి. నిజంగానే అలీ రీఎంట్రీ ఇచ్చాడా? లేదా కేవలం అతిథిలా వచ్చాడా?అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే.. ఇంకొన్ని గంటలు ఆగాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*