అవినీతిలో మరో కోణం

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయ వ్యత్యాసాలపై వచ్చిన అవినీతి ఆరోపణల మీద దర్యాప్తు జరుపుతారు. అవినీతి అధికారులు, వారి కుటుంబసభ్యులు, వారి బినామీల పేరుతో ఉన్న ఆస్తులు, చేస్తున్న వ్యాపారాలు, వాస్తవ విలువకు, పుస్తక విలువకు మధ్య ఉన్న తేడాలు మాత్రమే అవినీతి నిరోధక అధికారులు పరిశీలిస్తారు. ఏసీబీ అధికారులు మరో కోణంలో కూడా చూడాలి. చాలామంది అధికారుల పిల్లలు ప్రాథమిక విద్య మొదలు, ఉన్నత విద్య దాకా ప్రైవేట్/కార్పొరేట్ పాఠశాలలు, కళాశాల ల్లో చదువుతారు. కోచింగ్‌ల పేరుతో, విదేశాల్లో ఉన్నత విద్య పేరుతో ఏటా లక్షల్లో ఖర్చుచేస్తున్నారు. పైకి చూడటానికి పిల్ల ల చదువులే కదా అనేలా ఉన్నా, కానిస్టేబుల్ నుంచి గ్రూప్-1, 2 అధికారుల దాకా అనేకమంది ప్రభుత్వాధికారులు సర్వీ స్‌లో చేరిన మరుసటి ఏడాది నుంచే ఏటా లక్షల రూపాయల వరకు పిల్లల చదువుల పేరుతో ఖర్చుచేస్తున్నారు. వారి జీతభ త్యాలకు, చేస్తున్న వ్యయానికి ఏ మాత్రం సారూప్యం ఉండ టం లేదు. అధికారుల అవినీతిని అంచనా వేసే సందర్భాల్లో అవినీతి అధికారులు పిల్లల చదువుల కోసం అయ్యే ఖర్చు నూ పరిగణనలోకి తీసుకోవాలి. ఈ సమస్య కేవలం ఉద్యోగుల అవినీతితో మాత్రమే ముడిపడి లేదు, ఆయా అవినీతి అధికారుల పిల్లలతో పాటు చదువుకునే, వారి పిల్లలను చూస్తూ పెరుగుతున్న మిగతా పిల్లల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపే ప్రమాదమున్నది.ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే రెండుచేతులా సం పాదించవచ్చు, ఎంతైనా ఖర్చుచేయవచ్చు, ఖరీదైన అవకాశాలను సైతం అందిపుచ్చుకోవచ్చుననే ఆలోచనకు తోటి విద్యార్థుల మెదళ్ళలో విత్తనాలు పడే ప్రమాదం ఉన్నది. కండ్లముందు కదలాడుతున్న అవినీతితో ఆ చిన్నారులు రేపటి రోజు అవినీతి దారులవైపు తప్పటడుగులు వేయ రా?

భావి భారత పౌరులను తయారుచేయాల్సిన విద్యాసంస్థలు కలుషితమైతే జరుగబోయే విపత్తును ఆపేదెవ రు? తల్లిదండ్రుల అవినీతి సొమ్ముతో అవకాశాలను అందిపుచ్చుకున్న ఆయా ఉద్యోగుల పిల్లలు రేపటిరోజు అవినీతి రహిత సమాజ నిర్మాణం దిశలో అడుగులు వేస్తారని ఎలా భావించగలం? అవినీతిరహిత భారతం కోసం విద్యాలయాలు కలుషితం కాకుండా, అల్పాదాయ వర్గాల పిల్లల్లో అసంతృప్తి రగులకుండా చూడవలసిన బాధ్యత మనది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*