ఆచితూచి అడుగులు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించాలన్న కుతూహలాన్ని మరోసారి వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో విస్ఫోట పరిస్థితి ఉందని అంటూ అదొక సంక్లిష్టమైన ప్రదేశంగా అభివర్ణించారు. అక్కడ హిందువులు, ముస్లింలు ఉన్నారనీ, సర్దుకుపోలేకపోతున్నారనీ, తాను మధ్యవర్తిత్వం చక్కగా నెరుపగలననీ ఆయన అంటున్నారు. భారత, పాకిస్థాన్ ప్రధానులతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం ట్రంప్ చెబుతున్న మాటలివి! ట్రంప్ భారత్‌కు మద్దతు ఇస్తున్నట్టు మీడియాలో ఇప్పటికే ప్రచారం అయిపోయింది. కానీ ట్రంప్ మాటలు చూస్తే మద్దతు ఇస్తున్నారా, కశ్మీర్ పరిస్థితి ఆందోళకరంగా ఉందని ప్రపంచానికి చాటుతున్నారా అనే సందేహం కలుగుతుంది. అమెరికా వైఖరి ఎప్పుడూ నమ్మదగినదిగా ఉండదు. భారత్‌కు మద్దతు ఇస్తూనే ఇరుకునపెట్టే రీతి లో మాట్లాడుతుంది. మన దేశంతో స్నేహం చేస్తూనే ఉపగ్రహంగా మార్చేసుకునే పథకాలు అమలు చేస్తుంది. ఏకకాలంలో భారత్‌ను, పాకిస్థాన్‌ను స్నేహదేశంగా నమ్మించగలదు. అమెరికాకు కావలసింది తమ ప్రయోజనాలను తీర్చుకోవడం, తమ అధిపత్యాన్ని కాపాడుకోవడం.

స్నేహదేశం అని చెప్పుకోవడం కూడా ఈ లక్ష్యాల సాధనలో అనుసరించే ఒక వైఖరి! అమెరికా వైఖరిని మన దేశం మార్చడం సాధ్యం కాదు. మన ప్రభుత్వం చేయవలిసిందల్లా అమెరికాకు కానీ, మరే దేశానికి కానీ మన ఆంతరంగిక వ్యవహారాల్లో తలదూర్చే అవకాశం ఇవ్వకపోవడం. చైనా, పాకిస్థాన్‌లను శక్తిమే ర కట్టడి చేయవచ్చు, కానీ మిత్రరాజ్యాన్ని నియంత్రించడానికి నేర్పు కావాలె.

జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేయడం సరైన నిర్ణయమా అనేది ఒక చర్చ అయితే, కేంద్ర ప్రభుత్వం తక్షణం చేయవలసింది ఏమిటనేది మరో చర్చ.

జమ్ముకశ్మీర్‌పై తీసుకున్న నిర్ణయాలు భారత ఆంతరంగికమైనా, విదేశాలపై ప్రభావం చూపగలవని, ఈ ఉద్రిక్తతను సడలించడానికి భారత్, పాకిస్థాన్ చర్చలు జరుపాలని ఆ అధికారి హితవు చెప్పారు. అమెరికా అధికారి వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం కావాలె. అంతర్జాతీయంగా ఇప్పుడున్న అనుకూల పరిస్థితి ఎప్పుడూ ఉంటుందనుకోలేము.

కశ్మీర్‌లో ఎక్కువ కాలం భారీగా సైనిక బలగాలను కొనసాగిస్తూ, ఆంక్షలు ఎత్తివేయకపోతే విదేశాలు వేలెత్తి చూపడానికి అవకాశం కల్పించినట్టవుతుంది. కశ్మీర్‌లో వీలైనంత వేగంగా సాధారణ పరిస్థితులు నెలకొల్పడంతో పాటు ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తం కావాలె.

కేంద్ర ప్రభుత్వం చతురతతో వ్యవహరించి తాము చెబుతున్న ఫలితాలను సాధించినట్టయితే 370 అధికరణాన్ని నిర్వీర్యం చేయడం సరైందేనని నిరూపించుకున్నట్టు అవుతుంది. స్వయం ప్రతిపత్తి రద్దు విషయంలో ఇప్పుడు జరుగుతున్న చర్చ భిన్నాభిప్రాయాలతో కూడిన ది. ఎవరి దృఢాభిప్రాయాలు వారికి ఉంటాయి.

తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అనేది భవిష్యత్ పరిణామాలను బట్టి తేలుతుంది. పరిస్థితి ని తమకు అనుగుణంగా మలుచుకున్నప్పుడే మోదీ చెప్పుకుంటున్న లక్ష్యం నెరవేరినట్టు. మోదీ ప్రభుత్వం తాము అనుకున్నది చేయడానికి అనేక అనుకూలాంశాలు ఉన్నాయి. మోదీకి స్వపక్షం, విపక్షం నుంచి పెద్దగా అడ్డంకుల్లేవు.

పార్లమెంటులో తమ మాట నెగ్గించుకోగలుగుతున్నారు. జమ్ముకశ్మీర్ పరిస్థితిపై సుప్రీం కోర్టు కూడా కొంత వ్యవధి ఇవ్వాలన్నది. ఐక్యరాజ్య సమితి నుంచి కూడా ఒత్తిడి రావడం లేదు. తాను అనుకున్నది అమలు చేయడానికి మోదీకి ఇది మంచి తరుణం.

జమ్ముకశ్మీర్, లడాఖ్ అభివృద్ధి గురించి ప్రధాని మోదీ తన దృక్కోణాన్ని చక్కగా వివరించారు. అక్కడి పిల్లలకు విద్య అం దించడం, నైపుణ్యం గరిపి ఉద్యోగాలు ఇవ్వడం తమ కర్తవ్యమని చెప్పారు. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు అవరోధాలు తొలిగి అక్కడి ప్రజలకు మరింత లాభం జరుగుతుందని వివరించారు. ఈ వాగ్దానాలనే మోదీ ప్రభుత్వం ఆచరణలో చూపవలసి ఉం టుంది.

జమ్ముకశ్మీర్ ప్రజల మనసును చూరగొనడం ద్వారానే విమర్శకులకు తగు జవాబు ఇవ్వగలరు. కశ్మీర్‌లో ప్రభుత్వ కార్యాలయాలను, పాఠశాలలను తెరిచినట్టు ప్రభుత్వం చెబుతున్నది. కానీ ఉద్యోగస్తులు, విద్యార్థులు రావడం లేదు. వ్యాపారాలు సాగడం లేదు.

రవాణా అంతంత మాత్రం గా ఉన్నది. ల్యాండ్‌లైన్ ఫోన్లు చాలా వరకు పునరుద్ధరించినప్పటికీ, మొబైల్, ఇంటర్‌నెట్ సౌకర్యం ఇంకా లేదు. రాజకీయ నాయకులు నిర్బంధంలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కశ్మీర్ విషయమై అమెరికా విదేశాంగశాఖ అధికారి బుధవారం మాట్లాడిన తీరు గమనార్హమైనది.

సమీప భవిష్యత్తులో మేం కోరుకునేది- కశ్మీర్‌లో నిర్బంధంలో ఉన్న వారి విడుదల, ప్రాథమిక హక్కుల పునరుద్ధరణ, ప్రధాని చెపినట్టుగా మొదట కేంద్ర పాలిత ప్రాంతంగా, తర్వాత రాష్ట్రంగా సాధారణ పరిస్థితులు ఏర్పడటం, రాజకీయ చర్చలు ప్రారంభించడం… అని ఆ అధికారి వివరించారు. పౌరుల పై ఆంక్షలు తొలిగిపోవాలని, చట్టబద్ధ విధానాలను అనుసరించాలని సూచించారు. జమ్ముకశ్మీర్‌పై తీసుకున్న నిర్ణయాలు భారత ఆంతరంగికమైనా, విదేశాలపై ప్రభావం చూపగలవని, ఈ ఉద్రిక్తత ను సడలించడానికి భారత్, పాకిస్థాన్ చర్చలు జరుపాలని ఆ అధికారి హితవు చెప్పారు.

అమెరికా అధికారి వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం కావాలె. అంతర్జాతీయంగా ఇప్పుడున్న అనుకూల పరిస్థితి ఎప్పుడూ ఉంటుందనుకోలేము. కశ్మీర్‌లో ఎక్కువ కాలం భారీగా సైనిక బలగాలను కొనసాగిస్తూ, ఆంక్షలు ఎత్తివేయకపోతే విదేశాలు వేలెత్తి చూపడానికి అవకాశం కల్పించినట్టవుతుం ది. కశ్మీర్‌లో వీలైనంత వేగంగా సాధారణ పరిస్థితులు నెలకొల్పడంతో పాటు ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తం కావాలె. ప్రజాస్వామ్య విధానాలే మన దేశానికి బలాన్నిస్తాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*