ఆదిపురుష్ లో సునీల్ శెట్టి..?

ప్రభాస్ – ఓం రనౌత్ కలయికలో ఆదిపురుష్ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. రామాయణం నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో తెరకెక్కుతుండటం తో నటి నటుల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. అన్ని భాషల నటి నటుల కవర్ అయ్యేలా డైరెక్టర్ వారిని ఎంచుకుంటున్నారు.

కౌసల్య పాత్రలో హేమమాలిని, దశరథుడి పాత్రలో కృష్ణంరాజు , లక్ష్మణుడి పాత్రలో టైగర్ ష్రాఫ్ లను ఎంపిక చేసిన డైరెక్టర్..తాజాగా సునీల్ శెట్టి ని కూడా ఎంపిక చేసాడట. మరి ఈయన ఏ పాత్ర లో కనిపిస్తాడనేది సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉంటె ఈ మూవీ నుండి శ్రీరామనవమి సందర్భంగా అంటే ఏప్రిల్ 21న సాలిడ్ అప్‌డేట్ ఒకటి రానుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*