ఆర్‌సీఈపీపై భిన్నాభిప్రాయాలు

ఆర్‌సీయీపీ వంటి అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భారత్ లేకపోవడం వల్ల తూర్పు ఆసియా ప్రాంతీయ బలాబలాలు ఎట్లా ఉంటాయనే ప్రశ్న తలెత్తుతున్నది. భారత్‌కు మిత్రదేశాలైన జపాన్, సింగపూర్ ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఆర్‌సీఈపీలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు భారత్ అవసరమని ఈ దేశాలు భావిస్తున్నాయి. భారత్ లుక్ ఈస్ట్ పాలసీని అమలు చేస్తున్నప్పటినుంచి, ప్రాంతీయ కూటమిలో ఉండాలని ఆగ్నేయాసియా దేశాలు కోరుతున్నాయి. ఆర్‌సీఈపీలో భారత్ లేకపోవడం వల్ల ఇండో పసిఫిక్ భావనపై సందేహాలు తలెత్తుతున్నాయి.

కొన్ని నెలల పాటు చర్చలు జరిపిన మీదట ఆసియాలోని అతి పెద్ద స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం ఆర్‌సీఈపీలో చేరకూడదని భారత్ నిర్ణయించింది. ఈ ఒప్పందంలో చేరిన పదిహేను దేశాల్లో పది ఆగ్నేయాసియా దేశాల కూటమికి (ఆసియాన్)కు సంబంధించినవి. ఈ కూటమితో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాన్ని ఇప్పటికే కుదుర్చుకున్న మరో ఐదు దేశాలు కూడా ఈ ఆర్‌సీఈపీలో చేరాయి. 2020లో ఈ ఒప్పందంపై లాంఛనంగా సంతకాలు జరుగుతాయి. తాము ఆర్‌సీఈపీలో చేరకూడదని తీసుకున్న నిర్ణయమే సరైందని బ్యాం కాక్‌లో సోమవారం ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (తూర్పు విభాగం) విజయ్ ఠాకూర్ సిం గ్ అన్నారు.

ప్రపంచ పరిస్థితి, ఒప్పందంలోని సమతుల్యతపై జరిపిన తమ విశ్లేషణ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని సింగ్ వివరించారు. ఆర్‌సీఈపీలో భారత్ ఎంతో సదుద్దేశంతో, నమ్మకంతో చేరిందని నిక్కచ్చి గా సంప్రదింపులు జరిపిందని సింగ్ వివరించారు. ఇప్పుడున్న పరిస్థితు ల్లో భారత్ ఆర్‌సీఈపీలో చేరకపోవడమే మంచిదని భావించినట్టు వెల్లడించారు. అయినప్పటికీ ఈ ప్రాంత దేశాలతో వాణిజ్య, ప్రజల మధ్య సంబంధాలను కొనసాగిస్తామని తెలిపారు.

తమ ఆందోళనలు తొలగక పోవడంతో ఈ ఒప్పందంలో చేరకూడదని ప్రధాని నిర్ణయించినట్టు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. మన దేశ మౌలిక ప్రయోజనాలపై రాజీ లేదని వారంటున్నారు. ఆర్‌సీఈపీ మన అభిప్రాయాలను ప్రతిబింబించ డం లేదనీ, సమతుల్యంగా లేదని వారు వెల్లడించారు. చైనా నుంచి వచ్చి పడే దిగుమతుల నుంచి దేశీయ ఉత్పత్తులకు తగిన రక్షణలు లేకపోవడం మన దేశానికి ఆందోళనకరంగా ఉన్నది.

మన ఉత్పత్తులకు మార్కెట్ హామీ లభించలేదు. వాణిజ్యేతర అవరోధాల నుంచి రక్షణ ఇవ్వడం లేదు. మన దేశ నిర్ణయం మన రైతుల, వ్యాపారుల, పరిశ్రమల ప్రయోజనాలపై ఆధారపడి ఉంది. మన దేశ కార్మికులు, వినియోగదారుల ప్రయోజనాలు కూడా ముఖ్యమే.

అయితే మన దేశ ప్రయోజనాలకు తగిన హామీ లభించకపోవడంతో ఆర్‌సీఈపీలో భారత్ చేరడం లేదని ప్రధాని మోదీ ఆసి యా దేశాల నాయకుల సమావేశంలో తెలిపారు. పదిహేను దేశాలు ఇరువై అధ్యాయాలపై చర్చలను ముగించగా, భారత్‌కు మాత్రం కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయని సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. భారత్ సమస్యలను పరిష్కరించడానికి ఆర్‌సీఈపీలోని దేశాలన్నీ ప్రయత్నిస్తాయని, ఈ సమస్యల పరిష్కారంపైనే భారత్ నిర్ణ యం ఆధారపడి ఉంటుందని సంయుక్త ప్రకటన వివరించింది. ఆర్‌సీఈపీలో భారత్ చేరడంపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

పాలు, ఇతర ఉత్పత్తులపై సుంకాలు తగ్గించినట్టయితే చైనా నుంచి దిగుమతులు వరదలా వచ్చి పడుతాయని రైతులు, వ్యవసాయ ఉత్పత్తిదారులు ఆందోళన చెందుతున్నారు. చైనా నుంచి చౌకధరలకు వ్యవసాయ ఉత్పత్తులు వచ్చి పడితే ఇక్కడి ప్రజానీకానికి నష్టం వాటిల్లుతుంది. ఆర్‌ఎస్‌ఎస్ వ్యాపార విభాగం పెద్దఎత్తున ఆర్‌సీఈపీ వ్యతిరేక ప్రచారం ప్రారంభించింది. ఈ ఒప్పందం అమలైతే భారత్‌లో వ్యవసాయం, పరిశ్రమలు దెబ్బతింటాయని, ఆర్థికప్రగతి మందగిస్తుందని ప్రచారం చేసింది.

మన ఉత్పత్తి రంగా న్ని, వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి భారత్ విధానపరమైన నిర్ణయా లు తీసుకోకుండా సంకెళ్ళు పడుతాయని ఆర్‌ఎస్‌ఎస్ ఆర్థికవేత్త అశ్వని మహాజన్ ఆందోళన వ్యక్తంచేశారు. అయితే ఈ విస్తృత వ్యాపార పరిధికి అవతల ఉండటం కన్నా చేరడమే మన వ్యవసాయానికి మంచిదని కొంద రు వాదిస్తున్నారు. పాతకాలపు విధానాలను వదిలిపెట్టి వ్యవసాయ రం గంలో ప్రపంచీకరణ పరిస్థితులకు అనుగుణంగా పోటీతత్వాన్ని పెంచడం మంచిదని వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ డైరెక్టర్ ఎ.కె.గుప్తా అభిప్రాయపడ్డారు. కొన్ని పరిశ్రమల సంఘాలు కూడా భారత్ ఆర్‌సీఈపీలో చేరాల్సి ఉండెనని అంటున్నాయి.

భారత్ ఆర్‌సీఈపీలో చేరకపోతే ఆ దేశాల వాణిజ్య పరిధి నుంచి బయటపడుతామని సీఐ ఐ అభిప్రాయపడ్డది. ఆర్‌సీఈపీ దేశాల పెట్టుబడులు కూడా రావని అంటున్నది. ఆర్‌సీఈపీలో చేరకపోవడం వల్ల మన ఎగుమతులకు, పెట్టుబడులకు దెబ్బ అని సీఐఐ ఒక ప్రకటనలో పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వ వర్గాలలో కూడా ఆర్‌సీఈపీలో చేరడంపై భిన్నాభిప్రాయాలున్నాయి విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆర్‌సీఈపీలో చేరాలని అంటున్నది.

ఇతర మంత్రిత్వ శాఖలు విముఖతను వ్యక్తం చేశాయి. చివరికి రాజకీయ నిర్ణయమే ప్రధానమని దౌత్యవేత్తలు అంటున్నారు. ఆర్‌సీఈపీలో భారత్ లేకపోవడం బాధాకరమని సింగపూర్ ప్రధాని లీ హెసియెన్ లూం గ్ వ్యాఖ్యానించారు. ఆర్‌సీఈపీ వంటి అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భారత్ లేకపోవడం వల్ల తూర్పు ఆసియా ప్రాంతీయ బలాబలాలు ఎట్లా ఉంటాయ నే ప్రశ్న తలెత్తుతున్నది.

భారత్‌కు మిత్రదేశాలైన జపాన్, సింగపూర్ ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఆర్‌సీఈపీలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునేందు కు భారత్ అవసరమని ఈ దేశాలు భావిస్తున్నాయి. భారత్ లుక్ ఈస్ట్ పాలసీని అమలు చేస్తున్నప్పటినుంచి, ప్రాంతీయ కూటమిలో ఉండాలని ఆగ్నేయాసియా దేశాలు కోరుతున్నాయి. ఆర్‌సీఈపీలో భారత్ లేకపోవడం వల్ల ఇండో పసిఫిక్ భావనపై సందేహాలు తలెత్తుతున్నాయి.

భారత్ ఆర్‌సీఈపీకి దూరంగా ఉన్నట్టే, అమెరికా ట్రాన్స్ అట్లాంటిక్ భాగస్వామ్య ఒప్పందానికి దూరం జరిగింది. ఇండో పసిఫిక్ భావన భద్రతకు మాత్రమే పరిమితమైంది. ఆర్‌సీఈపీ మాత్రం ఆర్థిక రంగానికి సంబంధించినది. ఈ రెండు కలిస్తేనే పరస్పర ఆలంబనతో పరిపూర్ణత వస్తుంది.

ఆర్‌సీఈపీలో భారత్ లేకపోతే ఆసియాన్ దేశాల చేత ఇండో పసిఫిక్ భావనను ఆమోదింపజేయడం కష్టం. భవిష్యత్తులో తమకు కొన్ని మినహాయింపులు కావాలని ఒత్తిడిచేసే శక్తిని భారత్ కోల్పోయిందని విశ్లేషకులు భావిస్తున్నా రు. తర్వాత కాలంలో భారత్ చేరినట్టయితే, ఇతర దేశాలు ఇప్పటికే పెట్టుకున్న నిబంధనలకు లోబడి ఉండవలసి వస్తుం ది. టీపీపీలో చేరడంపై అమెరికా కూడా ఇటువంటి సందిగ్ధాన్ని ఎదుర్కొంటున్నది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*