ఆర్‌సీఈపీ వెనుక డ్రాగన్ వ్యూహం

ఈ ఆర్‌సీఈపీ ఒప్పందం వెనుక సభ్య దేశాలపై చైనా ఒత్తిడి స్పష్టంగా ఉన్నది. మిగిలిన సభ్యదేశాలకంటే చైనాకు ఈ ఒప్పందం ప్రస్తుత పరిస్థితులలో కీలకం. అందుకే ఈ ఒప్పందంపై చైనా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నది. ఇప్పటికే, తూర్పు ఆసియా దేశాలతో చైనాకు వాణిజ్యపరంగా మెరుగైన సంబంధాలే ఉన్నాయి. కానీ భారత్ మార్కెట్ చైనాకు ఇప్పుడు చాలా ముఖ్యం. ఇటీవల అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధ్దంతో చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నది. అక్కడి పరిశ్రమల ఉత్పతులకు అమెరికా పన్నుల దెబ్బ గట్టిగా తగిలి పారిశ్రామిక ప్రగతి పడకేసింది. అమెరికాతో ఏర్పడుతున్న వాణిజ్య లోటును పూడ్చుకోవడానికి భారత్ మార్కెట్‌వైపు చూస్తున్న చైనాకు ఈ ఒప్పందంపై భారత్ నిర్ణయం పంటికింద రాయిలా తగిలింది.

ఆధునిక ప్రపంచంలో విదేశీ వర్తకం కీలకమైనది. ఒక దేశం లో ఉన్న వనరులను, నైపుణ్యాలను సమర్థంగా వినియోగయోగించుకొని తద్వారా తయారైన ఉత్పతులను కొరత గా ఉన్న దేశాల మార్కెట్‌కు తరలించడంలో విదేశీ వర్తక ఒప్పందాల పాత్ర ముఖ్యమైనది. తద్వారా వినియోగదారులకు లబ్ధి చేకూరటంతోపాడు ఆయాదేశాల అభివృధికి తోడ్పడుతుంది. టారిఫ్, నాన్ టారిఫ్ అడ్డంకులను ఒప్పందాలతో సవరించుకొని ఒప్పంద దేశాల ఉత్ప తులకు మార్కెట్ అవకాశాలు మెరుగుపరుచుకోవడంలో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) కీలకమైనవి.

ఆసియాలో అగ్రశ్రేణి దేశాలలో భారతదేశం ఒకటి. అత్యధిక సంఖ్యలో ఎఫ్‌టీఏలు ప్రతిపాదించబడ్డాయి. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ ఇనిస్టి ట్యూట్ ప్రకారం ప్రస్తుతానికి, భారతదేశం 42 వాణిజ్య ఒప్పందాలను (ప్రాధాన్య ఒప్పందాలతో సహా) అమలుపై సంతకం చేసింది. వీటిలో 13 అమలులో ఉన్నాయి.

ఒకటి సంతకం చేయబడినా ఇంకా అమలు కాలేదు. 16 చర్చల కింద, 12 ప్రతిపాదిత/ సంప్రదింపులు లేదా అధ్యయనం కింద ఉన్నాయి. దేశంలో చాలావరకు ఉన్న ఎఫ్‌టీఏలు ఆసియా దేశాలతోనే ఉన్నాయి. భారతదేశం ఇప్పటివరకు సంతకంచేసి అమలు చేసిన ప్రధాన ఎఫ్‌టీఏల్లో దక్షిణ ఆసియా స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (సాఫ్టా), ఇండియా-ఆసియాన్ సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈ సీఏ), ఇండియా-కొరియా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సిపా), భారతదేశం-జపాన్ సిపా ఉన్నాయి.

సాఫ్టా ఒప్పందం 2006 జనవరి 1నుంచి అమలులోకి వచ్చింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం భారతదేశం ఇతర సాఫ్టా సభ్యదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2005-06లో 6.8 బిలియన్ల నుంచి 2018-19లో 28.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. అలాగే, ఆసియాన్ ఒప్పందం (సీఈసీఏ) 2010 జనవరి 1నుంచి అమలులోకి వచ్చింది. ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2009-10లో సుమారు 43 బిలియన్ డాలర్ల నుంచి 2018-19లో 97 బిలియన్ డాలర్లకు పెరిగింది.

కానీ గమనించాల్సిందే మంటే, ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల భారత్ కంటే ఇతర దేశాలే ఎక్కువ లబ్ధి పొందుతున్నాయి. దానికి కారణం యాభై లక్షల కోట్ల విలువైన మన దేశీయ మార్కెట్. ఇతర దేశాలు మన మార్కెట్ వల్ల లబ్ధి పొందుతున్నాయి, కానీ మన దేశం మాత్రం ఆ స్థాయిలో ఇతర దేశాల మార్కెట్‌ను ఆకర్షించుకోలేకపోతున్నది. ఇటీవలి కాలంలో ఆసియాన్ సభ్యదేశాలైన బ్రూనై, కంబోడియా, ఇండో నేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియెత్నాం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద భాగస్వాములైన భార త్, చైనా, జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ కలసి ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ) ఒప్పందం దిశగా ఈ నెలలో బ్యాంకాక్‌లో సమావేశమయ్యాయి.

ఈ ఆర్‌సీఈపీ ఒప్పందం గురిం చి 2011-12లోనే అవగాహన కుదిరింది. ఈ ఒప్పందం అమల్లోకివస్తే ఆయా దేశాలు కస్టవ్‌సు సుంకాలు లేకుండా వాణిజ్యం చేసుకోవ చ్చు. ప్రపంచ జీడీపీలో 34శాతం ఈ 16ఆర్‌సీఈపీ దేశాల నియంత్రణలోకి వస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ దేశాల వాటా 40 శాతం వరకు ఉంటుంది.

కానీ, ఆర్‌సీఈపీ ఒప్పందంపై భారత్‌లోని రైతు, వ్యాపారసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై భారత్ సంతకం చేస్తే ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రైతులు, చిన్న తరహా వ్యాపారుల బతుకులు ఛిద్రమౌతాయని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి సలహా బృందం ఆర్‌సీఈపీలో చేరాలని ఇదివరకు ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. ఆర్‌సీఈపీలో చేరకపోతే భారీ ప్రాంతీయ మార్కెట్‌కు భారత్ దూరమవుతుందని అభిప్రాయపడింది.

అయితే చివరికి ఆర్‌సీఈపీలో భాగం కాకూడదని ప్రధాని మోదీ బ్యాంకా క్ సమావేశంలో ప్రకటించడంతో దేశ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించినట్లయింది. మిగిలిన 15 సభ్యదేశాలు ఒప్పుకున్నా భారత్ మాత్రం అంగీకరించలేదు. అసలు ఈ ఒప్పందంపై వ్యతిరేకత ఎందుకంటే- ముఖ్యంగా రెండు కారణాలు. మొదటిది: ఒకవేళ భారత్ ఒప్పందం చేసుకుని ఉంటే భారతీయ మార్కెట్‌లోకి సభ్యదేశాల ఉత్పతులు గుట్టలుగా వచ్చిపడుతాయి.

ఉదాహరణకు న్యూజీలాండ్ పాల పొడి దిగుమతుల వల్ల భారత పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతుంది. చిన్న, సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల ఉత్పతులపై ప్రభావం పడి తద్వారా ఆ రంగం దివాళా తీస్తుం ది. అంతేకాదు వ్యవసాయరంగం సైతం ఇతర దేశాల ఉత్పత్తులవల్ల కుదేలవుతుంది. కొబ్బరి, మిరియాలు, రబ్బరు, గోధుమలు, నూనె గింజలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయి చిన్న వ్యాపారాలు ఘోరం గా దెబ్బతింటాయి.

ఇక రెండవ ది- మార్కెట్ సమస్య. మన దేశ మార్కెట్ ఇతర దేశాల మార్కెట్ కంటే పెద్దది. గతంలో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో భారత్ అనుభవాల దృష్ట్యా ఆర్‌సీఈపీలో భాగమయ్యే దేశాలు భారత్ ఎగుమతులను తీసుకోవడం కన్నా ఇక్కడికి దిగుమతులే ఎక్కువగా చేస్తాయి. అందుకనే ప్రధాని దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఈ ఆర్‌సీఈపీ ఒప్పందం వెనుక సభ్య దేశాలపై చైనా ఒత్తిడి స్పష్టంగా ఉన్నది. మిగిలిన సభ్యదేశాల కంటే చైనాకు ఈ ఒప్పందం ప్రస్తుత పరిస్థితులలో కీలకం. అందుకే ఈ ఒప్పందంపై చైనా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న ది. ఇప్పటికే, తూర్పు ఆసియా దేశాలతో చైనాకు వాణిజ్యపరంగా మెరుగైన సంబంధాలే ఉన్నాయి.

కానీ భారత్ మార్కెట్ చైనాకు ఇప్పుడు చాలా ముఖ్యం. ఇటీవల అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధ్దంతో చైనా ఆర్థికవ్యవస్థ కుదేలవుతున్నది. అక్కడి పరిశ్రమల ఉత్పతులకు అమెరికా పన్నుల దెబ్బ గట్టిగా తగిలి పారిశ్రామిక ప్రగతి పడకేసింది. అమెరికాతో ఏర్పడుతున్న వాణిజ్య లోటును పూడ్చుకోవడానికి భారత్ మార్కెట్‌వైపు చూస్తున్న చైనాకు ఈ ఒప్పందంపై భారత్ నిర్ణయం పంటికింద రాయిలా తగిలింది.

ఇప్పటికే చైనా వస్తువులతో సతమతమవుతున్న భారతీయ పరిశ్రమలు ఈ ఒప్పందం నుంచి భారత్ వైదొలుగడం వల్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఏదేమైనా ఆర్‌సీఈపీలో భారత్ చేరిక దేశానికి మంచి ది కాదు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ఆధారపడిన మన దేశీయ ఉత్పత్తులు, రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణ యం హర్షించదగినదే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*