ఆహాలో కలర్ ఫోటో వచ్చేది అప్పుడే!

టీజర్ వచ్చినప్పటి నుండి అంచనాలను రేకెత్తించిన సినిమా కలర్ ఫోటో. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న మసాలా సందీప్ అలియాస్ సందీప్ రాజ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇటీవలే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదుగుతున్న సుహాస్ కలర్ ఫోటోతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఇక హీరోయిన్ గా ఎదగడానికి స్ట్రగుల్ అవుతోన్న చాందిని చౌదరి ఈ సినిమాలో హీరోయిన్. లాక్ డౌన్ కు ముందే షూటింగ్ పూర్తైన ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే ఆహా ప్లాట్ ఫామ్ తో ఈ సినిమా డీల్ సెట్ అయింది. ఇప్పుడు అధికారికంగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 23న కలర్ ఫోటో చిత్రాన్ని ఆహాలో విడుదల చేయనున్నారు.
రూరల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే పీరియాడిక్ ప్రేమకథగా కలర్ ఫోటో గురించి చెబుతున్నారు. కీరవాణి తనయుడు కాల భైరవ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాట సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక కొబ్బరి మట్ట, హృదయ కాలేయం వంటి సినిమాలను నిర్మించి పేరు సంపాదించుకున్న సాయి రాజేష్ ఈ సినిమాకు కథ అందించడమే కాకుండా నిర్మించాడు కూడా.
మొత్తానికి టాలెంటెడ్ యంగ్ టీమ్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూద్దాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*