ఇన్ స్టా టాప్ 10 ఇండియన్స్!

ఇన్ స్టాగ్రామ్ లోని ఇండియన్ సెలబ్రిటీస్ ను అత్యధికంగా ఫాలో అయ్యే వారి సంఖ్య గణనీయంగా ఉంది. ఇందులో టాప్ టెన్ పర్శన్ పై దృష్టి పెడితే… ఆసక్తికరమైన విషయాలే మనకు కనిపిస్తాయి. మన దేశంలో ప్రజలు నాలుగు అంశాలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంటారని విశ్లేషకులు చెబుతుంటారు. సినిమా, క్రైమ్, క్రికెట్ మొదటి మూడూ కాగా, వీటికి సరిసమానమైన ప్రాధాన్యం పాలిటిక్స్ కూ జనం ఇస్తుంటారు. అయితే… యువత ఎక్కువ ఫాలో అయ్యే సోషల్ మీడియాలో క్రికెట్, సినిమా, పాలిటిక్స్ రంగాలలో ఉన్న వారికే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారన్నది వాస్తవం.

ఇన్ స్టాగ్రామ్ లో ఇండియన్ సెలబ్రిటీస్ ను అత్యధికంగా ఫాలో అయ్యే వారి జాబితాను తీస్తే టాప్ టెన్ లో క్రికెటర్ విరాట్ కొహ్లీ 97.2 మిలియన్ ఫాలోవర్స్ తో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక ద్వితీయ స్థానంలో హాలీవుడ్ లోనూ భారతీయ కేతనాన్ని ఎగురేస్తున్న ప్రియాంకచోప్రా నిలిచింది. ఆమె తర్వాత స్థానంలో శ్రద్ధా కపూర్, నాలుగో స్థానంలో దీపికా పదుకునే నిలిచారు. విశేషం ఏమంటే… గాయని, ఇండియన్ ఐడిల్ షో న్యాయ నిర్ణేత నేహా కక్కర్ ఐదో స్థానం దక్కించుకుంది. కానీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకునే పరిస్థితి వీరెవ్వరికీ కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఎందుకంటే… విరాట్ కు 97.2 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే, ప్రియాంక కు 60.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ముందు అనుకున్న విధంగా క్రికెట్, సినిమాలు తర్వాత పాలిటిక్స్ కూ మన యువత ప్రాధాన్యం ఇస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇన్ స్టాలో 51.1 మిలియన్ ఫాలోవర్స్ తో ఆరవ స్థానంలో నిలిచారు. ఇక ఆ తర్వాత స్థానాలను అలియా భట్, అక్షయ్ కుమార్, జాక్విలిన్ ఫెర్నాండేజ్, కత్రినా కైఫ్‌ దక్కించుకున్నారు. చివరి ముగ్గురు సెలబ్రిటీస్ యాభై మిలియన్ ఫాలోవర్స్ కు కాస్తంత చేరువలో ఉండటం విశేషం. ఇక 11 నుండి 20 స్థానాల్లో కూడా తెలుగు స్టార్స్ హీరోలకు, హీరోయిన్లకు చోటు దక్కకపోవడం విచారకరం. విరాట్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే… ఆయన భార్య, నటి అనుష్క శర్మ 11వ స్థానంలో నిలిచింది. ఇక తాప్సీ 38, కాజల్ 40, సమంత 49 స్థానాలతో సంతృప్తి పడాల్సి వచ్చింది. అయితే… మన తెలుగు హీరోలు సైతం సోషల్ మీడియాలో సత్తా చాటే రోజు ఎంతో దూరంలో లేదు!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*