ఉప్పెన డైరెక్టర్ కు ఎన్టీఆర్ ఆఫర్..?

సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన బుచ్చిబాబు..రీసెంట్ గా ఉప్పెన చిత్రంతో డైరెక్టర్ గా మారారు. ఈ మూవీ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించడమే కాదు వసూళ్ల వర్షం కురిపిస్తుంది. దీంతో బుచ్చిబాబు తో సినిమాలు చేసేందుకు యంగ్ హీరోల దగ్గరి నుండి అగ్ర హీరోల వరకు అనుకుంటున్నారట. ఇప్పటికే ‘ఉప్పెన’ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఆయనతో రెండు చిత్రాలకు అగ్రిమెంటు కుదుర్చుకుందని వార్తలు వస్తున్నాయి.

మరోపక్క, అక్కినేని నాగార్జున తన తనయుడు అఖిల్ తో ఓ సినిమా చేసిపెట్టమని భారీ ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. ఇదిలా ఉంటె ఎన్టీఆర్ సైతం బుచ్చి తో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడట. వాస్తవానికి ఎన్టీఆర్ తో బుచ్చిబాబుకి ఇప్పటికే సాన్నిహిత్యం వుంది. గతంలో ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి సుకుమార్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన సమయంలో ఎన్టీఆర్ తో బుచ్చిబాబుకు పరిచయం ఏర్పడిందట. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*