ఏయ్‌ పాకిస్తాన్‌.. నువ్వు ఒక్కటి కొడితే’

పుల్వామాలో భారత సైనికులపై జరిపిన ఉగ్రదాడికి ప్రతిగా మన వైమానిక దళం గట్టిగా సమాధానమిచ్చింది. మంగళవారం తెల్లవారు జామున పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిభిరాలపై భారత వాయుసేన విరుచుకుపడింది. 12 విమానాలు పాల్గొన్న ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతం అయ్యుంటారని భావిస్తున్నారు. ఈ దాడుల్లో జైషే మహ్మద్‌కు చెందిన పలువురు అగ్రనేతలు కూడా చనిపోయారని భావిస్తున్నారు.

ఈ సందర్భంగా మన వాయుసేనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సోషల్ మీడియాలో సర్జికల్‌ స్ట్రైక్‌ 2 అనే హ్యాస్‌ ట్యాగ్‌ ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా సినీరంగంలోని ప్రముఖులు మన సైన్యం ధైర్య సాహసాలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ బ్రావో ఇండియా అంటూ ట్వీట్ చేయగా.. సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తనదైన స్టైల్‌లో ‘ఏయ్‌ పాకిస్తాన్‌, నువ్వు ఒకటి కొడితే మేం నాలుగు కొడతాం’ అంటూ ట్వీట్ చేశాడు.

బాలీవుడ్ టాప్ హీరో జయహో అంటూ ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశాడు. ఆర్జీవీ శిష్యుడు పూరి కూడా అదే స్టైల్‌లో స్పందించాడు. తన దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి సినిమాలోని ‘బుల్లెట్టు దిగిందా లేదా’ అనై డైలాగ్‌ను ట్వీట్ చేసి పూరి భారత వాయుసేనకు వందనం అన్నాడు. బాలీవుడ్ స్టార్లు అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవగన్‌, అభిషేక్‌ బచ్చన్‌, రవీనా టండన్‌లు సోషల్‌ మీడియాలో భారతసైన‍్యంపై ప్రశంసల జల్లు కురిపించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*