ఒక క్రికెటర్‌ను బాధించే అంశం అదే’

విజయవాడ: జీవితంలో ఒక క్రికెటర్‌ను బాధించే అంశం ఏదైనా ఉంటే అది రిటైర్మెంటేనని టీమిండియా మాజీ క్రికెటర్‌ వేణుగోపాలరావు పేర్కొన్నారు. తాను 25 ఏళ్లు క్రికెటర్‌గా సేవలందించానని, తాను ఈ స్థాయిలో ఉండటానికి కుటుంబ ప్రోత్సహమేనని అన్నారు. ప్రత్యేకంగా తన తండ్రి వల్లే ఇన్ని విజయాలు సాధ్యమైనట్లు తెలిపారు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ)కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు.. వేణుగోపాలరావును ఘనంగా సత్కరించారు. దీనిలో భాగంగా మాట్లాడిన వేణుగోపాలరావు.. ప్రతీ క్రికెటర్‌కు రిటైర్మెంట్‌ అనేది ఎక్కువగా బాధిస్తుందన్నారు. ఆంధ్ర నుంచి ఎక్కువ మంది యువ క్రికెటర్లు దేశానికి ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఏసీఏకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలియజేశారు. లోధా కమిటీ నిబంధనల ప్రకారమే నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక జరిగిందన్నారు

ఏసీఏ నూతన కార్యవర్గం

పి. శరత్‌ చంద్ర – అధ్యక్షులు
వీవీఎస్‌ఎస్‌కేకే యాచేంద్ర
వి. దుర్గా ప్రసాద్- ప్రధాన కార్యదర్శి
కేఎస్‌. రామచంద్ర రావు-జాయింట్ సెక్రటరీ
ఎస్‌. గోపినాధ్ రెడ్డి -కోశాధికారి
ఆర్‌. ధనుంజయ రెడ్డి – కౌన్సిలర్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*