ఒప్పుల కుప్ప.. పప్పు!

నోటికి రుచినే కాదు , పొట్టకు పోషకాలు అందించడంలోనూ పప్పులదే పైచేయి. రోజువారీ ఆహారంలో పప్పును తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

  • పప్పుల్లో ప్రొటీన్లు, పీచుపదార్థం అధికంగా ఉంటాయి. ఓ కప్పు ఉడకబెట్టిన పప్పులో ఆ రోజుకు సరిపడా ఫైబర్‌ లభిస్తుంది.
  • పప్పులో ప్లాంట్‌ బేస్డ్‌ ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది. మాంసాహారానికి దూరంగా ఉండేవారికి ప్రొటీన్లు పరిపూర్ణంగా అందవు. అలాంటివారు.. ప్రొటీన్ల కోసం పప్పును తీసుకోవాలి. పప్పుల్లో ఆవశ్యకమైన అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి.
  • పప్పులో మధుమేహాన్ని తగ్గించే గుణాలున్నాయి. ప్రొటీన్‌తో పాటు.. పీచుపదార్థాలు ఎక్కువగా లభించడంతో మధుమేహం అదుపులో ఉంటుంది. పైగా వీటి ైగ్లెసిమిక్‌ ఇండెక్స్‌ కూడా చాలా తక్కువ.
  • వీటిలోని పోషకాలు మంచి బ్యాక్టీరియాను పెంచి, చెడు బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. జీర్ణాశయ క్యాన్సర్‌, ఇరిటబుల్‌ బొవెల్‌ సిండ్రోమ్‌ వంటి సమస్యలను నిరోధిస్తాయి.
  • వీటిలో క్యాన్సర్‌ కణాల పెరుగుదలను నియంత్రించే విటమిన్లు, మినరల్స్‌, ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి.
  • పప్పును ఆహారంలో భాగం చేసుకుంటే పేగు క్యాన్సర్‌ రాకుండా ఉంటుంది. పేగుల్లోని కణాల ఆరోగ్యాన్ని మెరుగు
  • పరచి.. క్యాన్సర్‌ను నియంత్రించడంతో పాటు క్యాన్సర్‌ కణితులు పెరగకుండా చూస్తుంది.
  • పప్పులో మెగ్నీషియం, పొటాషియం వంటి గుండె ఖనిజ లవణాలుంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గిస్తాయి. పప్పులోని పీచు పదార్థం రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్‌ను, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
  • n పప్పులో కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్‌- ఎ, జింక్‌ ఉంటాయి. కాబట్టి, కంటిచూపు మెరుగవుతుంది. ముఖ్యంగా రేచీకటితో బాధపడేవారు.. పప్పును ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా సమస్య తీవ్రతను తగ్గించుకోవచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*