‘చహర్‌ ఇదేం బాలేదు.. పాపం జైస్వాల్‌ను చూడు’

ఢిల్లీ: ముంబై ఇండియన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ రాహుల్‌ చహర్‌ వేశాడు. అప్పటికే రాజస్తాన్‌ రాయల్స్‌ వికెట్‌ నష్టానికి 85 పరుగులతో ఆడుతుంది. ఓపెనర్‌ బట్లర్‌ 41 పరుగులు చేసి చహర్‌ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. అయితే చహర్‌ వేసిన 10వ ఓవర్‌ మూడో బంతిని జైస్వాల్‌ డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా కళ్లు చెదిరే సిక్స్‌ కొట్టాడు. జైస్వాల్‌ సిక్స్‌కు చహర్‌ బిత్తరపోయాడు. అయితే ఇన్నింగ్స్‌ ఐదో బంతిని జైస్వాల్‌ ఆడే క్రమంలో చహర్‌కే క్యాచ్‌ ఇచ్చి కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు.

అయితే చహర్‌ వికెట్‌ తీశానన్న ఆనందంలో జైస్వాల్‌ను కోపంగా చూస్తూ బంతిని అతని వైపు విసిరినట్లు చేశాడు. దీంతో జైస్వాల్‌ కొద్ది సెకన్లపాటు చహర్‌ను చర్యకు ఆశ్చర్యపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ”ఏంటి చహర్‌ ఎంత వికెట్‌ తీస్తే.. అంత కోపంతో చూడాలా.. పాపం జైస్వాల్‌ చూడు ఎలా అయిపోయాడో” అంటూ కామెంట్లు పెట్టారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత  20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాజస్తాన్‌ బ్యాటింగ్‌లో సంజూ సామ్సన్‌ 42 పరుగలతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. బట్లర్‌ 41, దూబే 35, జైస్వాల్‌ 32 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో రాహుల్‌ చహర్‌ 2, బుమ్రా, బౌల్ట్‌లు చెరో వికెట్‌ తీశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*