తెల్లన్నం. కూల్ డ్రింక్స్ కన్నా ఎక్కువ ప్రమాదమట..!

ఏది తిన్నా అన్నం తిననిదే కడుపు నిండినట్టు అనిపించదు చాలామందికి. భారతదేశంలో ఎక్కువ శాతం ప్రజలు తినేది అన్నమే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్నమే వాళ్ల ప్రధాన వంటకం. చైనాలోనూ అన్నాన్ని ఎక్కువగా తీసుకుంటారు. అయితే.. పాలిష్ చేయని అన్నం తింటే ఏం కాదు. కానీ… ఇప్పుడు ఉన్న బియ్యమంతా పాలిష్ చేసిన బియ్యమే. ఆ బియ్యాన్నే మనం తింటున్నాం. పాలిష్ చేసిన బియ్యం… తౌడుతో సమానమట. అంటే.. మనం తౌడును తింటున్నాం రోజు.

బియ్యం తెల్లగా మెరుస్తున్నాయంటే వాటిని మిల్లుల్లో బాగా పాలిష్ చేశారని అర్థం. పాలిష్ చేయడం వల్ల పోషకాలన్నీ పోయి ఉత్త బియ్యాన్ని తినడం వల్ల… సరైన పోషకాలు శరీరానికి అందక పోగా… గ్లూకోజ్ గా చక్కెర రక్తంలో కలిసిపోతుంది. దీని వల్ల షుగర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

సాధారణంగా ఓ చిన్న కూల్ డ్రింక్ లో చక్కెర స్థాయి ఎంత ఉంటుందో.. అంతకంటే ఎక్కువ చక్కెర స్థాయి ఒక కప్పు అన్నంలో ఉంటుందట. అంటే.. ఒక కప్పు తెల్లన్నం తిన్నారంటే… కూల్ డ్రింక్ తాగిన దానికంటే ఎక్కువ ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే… పాలిష్ చేసిన బియ్యం కాకుండా… బ్రౌన్ రైస్, దొడ్డు బియ్యం తినాలని… నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే.. త్వరలోనే షుగర్ వ్యాధి బారిన పడటం ఖాయమని హెచ్చరిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*