దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ కేవీ ఆనంద్‌ కన్నుమూత

ప్రముఖ తమిళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ కేవీ ఆనంద్‌(54) తుది శ్వాస విడిచాడు. ఆయన చెన్నైలో గుండెపోటుతో మరణించాడు. కేవీ ఆనంద్‌ మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కేవీ ఆనంద్‌ ఫొటో జర్నలిస్టుగా కెరీర్‌ ఆరంభించాడు. గోపుర వాసలిలె, మీరా, దేవార్‌ మాగన్‌, మఅరన్‌, తిరుద తిరుద సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌ దగ్గర అసిస్టెంట్‌గా వ్యవహరించాడు. 1994లో తొలిసారిగా మలయాళ మూవీ ‘తెన్మావిన్‌ కోంబత్‌’కు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. తొలి సినిమాతోనే జాతీయ పురస్కారాన్ని సైతం అందుకున్నాడు. సుమారు పదేళ్ల పాటు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన కేవీ ఆనంద్‌ 2005లో ‘కన కందేన్‌’ సినిమాతో దర్శకుడిగా మారాడు. అయాన్‌, కో, మాట్రాన్‌, అనేగన్‌, కవన్‌, కప్పాన్‌ సినిమాలకు సైతం డైరెక్షన్‌ చేశాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*