నిజం కనబడుతలేదా?

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2016 రిపోర్టును విడుదల చేసింది. అందులో రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన లెక్కలు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 11,379 మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. 20 15 సంవత్సరంలో 1400 మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. అది 2016 వచ్చేసరికి 645కి పడిపోయింది. అంటే 52 శాతం తగ్గుదల నమోదయిందన్న మాట. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో నమోదైన రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణది 6వ స్థానం. మొద టిస్థానంలో మహారాష్ట్ర (3,661), తర్వాతి స్థానంలో కర్ణాటక (2,079), మధ్యప్రదేశ్‌ (1,321), 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ (804), 5వ స్థానం లో ఛత్తీస్‌గఢ్‌ (682) మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు రికార్డు లు చెబుతున్నాయి. ఈ వార్తను అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ‘తెలంగాణ లో జరుగుతున్న మంచిని ఓర్వలేని పత్రికలు కొన్ని ఈ వార్తను మరొక్కసారి తెలంగాణను చీకటికోణంలో చూపించే ప్రయత్నం చేశాయి. అమరావతిలో అచ్చయిన ఈనాడు పత్రిక ‘అన్నదాత ఆత్మహత్యల్లో తెలంగాణకు 6వ స్థానం’ అని శీర్షిక పెట్టి వార్త ప్రచురించింది. 4వ స్థానంలో ఆం ధ్రప్రదేశ్‌ అని రాసింది.

అమరావతి డేట్‌లైన్‌తో వచ్చిన వార్తలో తెలంగా ణ కంటే రెండు స్థానాలు పైన ఉన్న ఆంధ్రప్రదేశ్‌ గురించి రాయకుండా, ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువన్నట్లు ప్రచురించాయి. 804 కంటే 645ను ఎక్కువచేసి చూపించింది. మరో పత్రిక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా తెలంగాణను అవకాశం దొరికినప్పుడల్లా బద్నాం చేసే ఈ పత్రిక పూర్తిగా వాస్తవ విరుద్ధమైన కథనాన్ని రాసింది. హెడ్‌లైన్‌లో తెలంగాణది 4వ స్థానమని రాసింది.

హైదరాబాద్‌ డేట్‌లైన్‌తో ఈ వార్త అచ్చయింది. తెలంగాణలో 490 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాసిన ఈ పత్రిక ఆంధ్రప్రదేశ్‌ సంఖ్యను మాత్రం తక్కువచేసి 124గా చూపించింది. 2014తో పోలిస్తే తెలంగాణ లో రైతు ఆత్మహత్యలు గణనీయంగా అంటే 52 శాతం తగ్గిన సంగతి మరుగున పడేసింది. ఆ వార్త పక్కనే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వార్త ఉన్నది.

అందులో ఆంధ్రప్రదేశ్‌లో గణనీయంగా తగ్గిన రైతుల ఆత్మహత్యలు అని మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో 12 శాతం తగ్గిన రైతు ఆత్మహత్యలు అని రాసింది. తెలంగాణలో 52 శాతం రైతు ఆత్మహత్యలు తగ్గి తే ఆంధ్రప్రదేశ్‌లో 12 శాతం తగ్గినయి. మరి 52 శాతం తగ్గడం గొప్పా?

12 శాతం తగ్గడం గొప్పా..? మరో పత్రిక ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌. ఈ పత్రిక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాను తలదన్నింది. ‘టి.ఎస్‌.ఫార్మర్‌ సూసైడ్‌ రేట్‌ థర్డ్‌ హయ్యస్ట్‌ రేట్‌ ఇన్‌ కంట్రీ’అని రాసింది.

తెలంగాణలో 632 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాస్తూనే దేశంలో 3వ స్థానమని చెప్పింది. 6వ స్థానంలో ఉన్న తెలంగాణను 3వ స్థానంగా చూపించి పైశాచికానందం పొందింది. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను వక్రీకరించి చూపించిన పత్రికలు కొన్నయితే ఇంకా కొన్ని ఆ వార్తను అసలు ముద్రించనే లేదు. తెలివైన తెలంగాణ పాఠకులు వక్రీకరించిన వార్తను అర్థం చేసుకుంటారు.

రాసిన వాడెవడు..? వాడేం ఆశిస్తున్నాడు…? అనేది తెలంగాణ పాఠకులకు తెలు సు. వార్తను రాయని పత్రికలు ఎక్కడ వాస్తవాలు రాయవల్సి వస్తదోనని ముఖం చాటేశాయి.

ఈ వార్తను రాసిన ఈ ఒక్క పత్రిక కూడా దేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు ఇప్పటివరకు బీజేపీ, కాంగ్రెస్‌ పాలించిన రాష్ర్టాల్లోనే ఉన్నాయనే సంగతి రాయలేదు. రైతుల ఆత్మహత్యల్లో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌. ఈ రాష్ర్టాలు 2016లో బీజేపీ పాలిత రాష్ర్టాలు. ఇంకో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ లో బీజేపీ మిత్రపక్షమైన టీడీపీ అధికారంలో ఉన్నది.

తెలంగాణ ఏర్పాటై ఐదేండ్లు గడిచిపోయినా తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణ ప్రజలు ఆశించిన ప్రయోజనాలు పొందడం లేదని తెలంగాణ వ్యతిరేకులు లేవనెత్తుతున్న వాదన అని పత్రికలు మోస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేకరంగాల్లో విప్లవాత్మక మార్పులు మనం చూశాం. మొన్నటికి మొన్న మాంసం ఉత్పత్తు ల్లో తెలంగాణ టాప్‌ అనే వార్త చూసి నం. 2014-15లో 5.05 లక్షల టన్నులు ఉన్న ఉత్పత్తి 2018-19లో 50 శాతం పెరిగి 7.54 లక్షల టన్నులకు చేరుకుంది. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌, సాగునీరు, పెట్టుబడి కి రైతుబంధు లాంటి పథకాలు ప్రవేశపెట్టి రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

రైతులకు ముఖ్యమంత్రిపై కొట్లాడి తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడిగా అపారమైన నమ్మకం ఉన్నది. అందుకే ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయి. రైతులకు ఎలాంటి నష్టం లేకుండా కంటికి రెప్ప లా కాపాడుకునే ముఖ్యమంత్రి ఉండబట్టే ఆత్మహత్యల ఆలోచనల్లోంచి రైతు లు బయటకు వస్తున్నరు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి పథకాలు పూర్త యితే రైతు కాలుమీద కాలు వేసుకొని బతుకుతడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*