నిబద్ధ నైపుణ్య సేవల కోసం..

ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు క్రమం తప్పకుం డా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. దీనిపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. తదనుగుణంగా వినూత్నపద్ధతిలో స్టేట్ ట్రైనింగ్ ఇనిషియేటివ్‌కు శ్రీకారం చుడితే బాగుంటుందేమో! ఇలా చేయడం ద్వారా శిక్షణ పొందినవారి వ్యక్తిగత, సామూహిక, సంస్థాగత పనితీరులో మెరుగుదల ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దీంతోపాటు వారి సామర్థ్యం కూడా వృద్ధి చెందుతుంది. దీనికోసం శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు, శాఖాధిపతుల ముఖ్యమైన బాధ్యతల్లో ఒకటిగా చేసి, వారివారి స్థాయిల్లో వారిని ట్రైనింగ్ కమిషనర్లుగా నామినేట్ చేయాలి. ట్రైనింగ్ కమిషనర్లుగా వీరి బాధ్యతల నిర్వహణలో చేదోడువాదోడుగా ఉండటానికి ప్రతి జిల్లాలో, రాష్ట్రస్థాయి ప్రభు త్వశాఖలో శిక్షణా కార్యక్రమాల అమలుకు ట్రైనింగ్ కో ఆర్డినేటర్లను నియమించాలి.

ఎంసీఆర్ హెచార్డీ ఇనిస్టిట్యూట్‌లో విజ్ఞానపరమైన అర్హతలు గల, అనుభవుజ్ఞులైన, నిబద్ధత గల నిపుణుల ఫాకల్టీ బృందం ఉన్నది. వీరిలో కొంద రు విజిటింగ్ ఫ్యాకల్టీ కాగా కొందరు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులు. ఏటా దీనిలో 15,000 మంది వివిధస్థాయి ఉద్యోగులు ఈ సంస్థలో శిక్షణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో 1996లో కేంద్ర ప్రభుత్వం జాతీయ శిక్షణా విధానాన్ని విడుదల చేసింది.

దాన్నే తిరిగి 2012లో ఆధునీకరించారు. జాతీయ విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తమ తమ రాష్ట్ర శిక్షణావిధానాలను తయారు చేసుకోవాలని కేంద్రం సూచించింది.

ప్రభుత్వం చేపట్టబోయే ఈ క్రమబద్ధ శాస్త్రీయ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఏడాదిలో కనీసం ఒక్కసారైనా ప్రభుత్వసంక్షేమ కార్యక్రమాలపైనా, ప్రభుత్వ పథకాలపైనా పరిపూర్ణంగా అవగాహన కలిగించాలి. వారి పనితీరులో సామర్థ్య పెంపుదల దిశగా శిక్షణ డిజై న్ తయారుకావాలి. శిక్షణ పూర్వరంగంలో శిక్షణకు హాజరయ్యేవారి పని కి, ఉద్యోగానికి సంబంధించి ఉండాలి.

ఒక గ్రూప్‌గా వారు నిర్వహించాల్సిన విధుల, వారు పనిచేస్తున్న శాఖల అవసరాల గురించి, అభ్యర్థుల శిక్షణ అవసరాలు గుర్తించాలి. ఈ యావత్ ప్రక్రియలో భాగంగా సచివాలయ స్థాయిలో మొదటగా ఉండాలి. ప్రభుత్వశాఖల స్థాయిలో, జిల్లాస్థాయిలో కార్యదర్శులుగా, హెచ్‌ఓడీలుగా, జిల్లా కలెక్టర్లుగా పనిచేస్తున్న అఖిల భారత సర్వీసు (ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్) అధికారులకు శిక్షణ ఇవ్వాలి. దీనిద్వారా వారి సామర్థ్యం పెంపుదలకు తీసుకుంటున్న చర్యలపై అవగాహన కలిగించడానికి మూడురోజుల ఓఎంఓటీ (ఓరియంటేషన్ టు మానేజ్‌మెంట్ ఆఫ్ ట్రైనింగ్) శిబిరం నిర్వహిస్తే మంచిది.

ట్రైనింగ్‌లో ఉన్నతస్థాయి అధికారుల నిబద్ధత, అంకితభావం ఉండాలి. కాబట్టి దానికి సంబంధించిన అం శాలు చర్చించే వీలు కూడా ఈ గోష్టిలో కలుగుతుంది. వీరికి చేదోడుగా పనిచేయాల్సిన ట్రైనింగ్ కో ఆర్డినేటర్లకు మేనేజ్‌మెంట్ ఆఫ్ ట్రైనింగ్‌లో శిక్షణ ఇవ్వాలి.శిక్షణా విధానం కేవలం అందులో పాల్గొంటున్న వారి విజ్ఞానం, నైపు ణ్యం మెరుగుపరుచడమే కాదు. వారి కార్యధోరణిలో, వైఖరిలో గణనీయమైన మార్పు చోటుచేసుకోవాలె.

తద్వారా పౌరులకు, ప్రజా బాహుళ్యానికి మరింత సమర్థవంతమైన, పటిష్ఠమైన సేవలు అందించడానికి దోహదపడాలి. ప్రభుత్వపరంగా చేపట్టిన యావత్ శిక్షణా కార్యాచరణకు దార్శనికత చూపాలి. స్థూలస్థాయిలో పర్యవేక్షించడానికి, సమీక్షించడానికి ఒకవిధమైన రాష్ట్రస్థాయి శిక్షణా మండలిని అవసరమనుకుంటే ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటుచేయాలి. ఆ మండలిలో క్షేత్రస్థాయి, ఉన్నత స్థాయి శిక్షణా యాజమాన్య నిపుణులను భాగస్వాములను చేయాలి.

వ్యక్తిగతంగా, శాఖాపరంగా, హెచ్‌వోడీ అవసరాలకు అనుగుణంగా శిక్షణావసరాలను గుర్తించాలి. శిక్షణావసరాల ఆధారంగా చక్కటి శిక్షణా డిజైన్ తయారుచేసి నిర్ణీత కాలవ్యవధిలో తగు శిక్షణ ఇప్పించాలి. బడ్జెట్ అంచనాలతో సహా వారివారి శాఖలకు కావాల్సిన వార్షిక శిక్ష ణా కార్యాచరణ పథకాల రూపకల్పన బాధ్యతను సంబంధిత హెచ్‌వోడీలకు అప్పగించాలి. ఈ యావత్ ప్రక్రియకు ప్రధాన సమన్వయ సంస్థగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థను నియమించి, రాష్ట్రంలోని ఇతర శిక్షణాసంస్థల, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ లాంటి సంస్థల సేవలను ఉపయోగించుకోవాలి.

ప్రభుత్వోద్యోగులు, ప్రజా ప్రతినిధులను శిక్షణ నిమిత్తమై, వారివారి బాధ్యతలకు అనుగుణంగా నాలుగు భాగాలు గా విభజించవచ్చు. అవి: మొదటిది విధానస్థాయి, రెండవది పరిపాలనా స్థాయి, మూడవది అమలుపరిచే స్థాయి, నాలువది పై మూడుస్థాయిల వారికి మద్దతుగా పనిచేసే కింది స్థాయి సిబ్బంది. పాలసీ స్థాయి వారిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, (కార్యదర్శి, అంతకంటే పైస్థాయి) అఖిల భారత సర్వీస్ సీనియర్ అధికారులు ఉంటారు. వీరికి సంస్థాగత ప్రవర్తనకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.

అడ్మినిస్ట్రేటివ్ స్థాయి అధికారులలో హెచ్‌వోడీలు, కార్యదర్శి స్థాయి కంటే కింది అఖిలభారత సర్వీసు అధికారులు ఉంటారు. ఎగ్జిక్యూటివ్ లేదా అమలుపరిచే స్థాయి వారిలో మండలస్థాయి వరకూ క్రియాశీలక పాత్ర పోషించే క్షేత్రస్థాయి అధికారులుంటారు. మిగిలిన వారంతా కిందిస్థాయి లేదా క్లరికల్, పర్యవేక్షక క్యాటగిరికి చెందిన ఉద్యోగులు. రాష్ట్రం మొత్తం మీద అన్ని విభాగాల్లో కలిపి సుమారు 5 వేల నుంచి 10 వేల మంది వ్యూహాత్మక బాధ్యతలు నిర్వర్తిం చే ప్రభుత్వ ఉద్యోగులను, ప్రజాప్రతినిధులను గుర్తించాలి.

వారికి ప్రత్యేక శిక్షణాకార్యక్రమాలు నిర్వహించాలి. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపట్ల నిబద్ధత, అంకితభావం, కార్యనిర్వహణ పెంపొందేలా, మెరుగుపడేలా చేయాలి. ఈ మొత్తం శిక్షణా వ్యవహారం విజయవంతం కావడానికి, సత్ఫలితా లు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ఎపెక్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ సేవలను ఉపయోగించుకోవా లి. ఎంసీఆర్ హెచార్డీ ఇనిస్టిట్యూట్‌లో విజ్ఞానపరమైన అర్హతలు గల, అనుభవుజ్ఞులైన, నిబద్ధత గల నిపుణుల ఫాకల్టీ బృందం ఉన్నది.

వీరిలో కొంద రు విజిటింగ్ ఫ్యాకల్టీ కాగా కొందరు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులు. ఏటా దీనిలో 15,000 మంది వివిధస్థాయి ఉద్యోగులు ఈ సంస్థలో శిక్షణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో 1996లో కేంద్ర ప్రభుత్వం జాతీయ శిక్షణా విధానాన్ని విడుదల చేసింది. దాన్నే తిరిగి 2012లో ఆధునీకరించారు. జాతీయ విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తమ తమ రాష్ట్ర శిక్షణా విధానాలను తయారు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ సేవలను ఉపయోగించుకొని ఒక క్రమపద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ, ప్రజా ప్రతినిధులందరికీ వారివారి అవసరాలకు తగిన విధంగా శిక్ష ణా కార్యక్రమాలు అమలుచేయాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*