ప్యారిస్‌లో సామజవరగమన

‘అల.. వైకుంఠపురమలో..’ చిత్రంలోని ‘సామజవరగమన….’ పాట శ్రోతలను, సంగీతప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. తమన్‌ స్వరకర్త. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ ప్యారిస్‌లోని అందమైన లొకేషన్స్‌లో జరుగుతోంది. ఈ పాట చిత్రీకరణ కోసం వారం రోజులు చిత్రబృందం ప్యారిస్‌లో ఉంటుంది.

ఈ పాటతో చిన్న చిన్న ప్యాచ్‌ వర్క్స్‌ మినహా షూటింగ్‌ పూర్తయినట్లేనట. ఈ నెలాఖరుకల్లా చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారట. అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ ‘అల.. వైకుంఠపురమలో..’ జనవరి 12న విడుదల కానుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*