ప్రజా సంక్షేమానికే పట్టం

తెలంగాణ సమాజం కూడా సామాజిక కదలికలో మొత్తం భారత సమాజానికే ఆదర్శంగా నిలిచింది. ఆ చైతన్య పునాదుల్లోంచే బీజేపీ హుజూర్‌నగర్‌లో ప్రజా తిరస్కరణకు గురైంది. రాష్ర్టాభివృద్ధికీ, పైరుపచ్చల తెలంగాణ కోసం కేసీఆర్‌ లాంటి సర్వమత ప్రేమికుడూ మానవతావాది అవసరం. ఈ చారిత్రక నేపథ్యంలోంచే కమలాన్ని రాష్ట్రంలో అడ్డుకోవడం మనందరి కర్తవ్యం.

ఒక సున్నితమైన సమయంలో జరిగిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక అనే క ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్‌, బీజేపీలు తమ సత్తాను చాటడానికి అందివచ్చిన అవకాశంగా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికను చెప్పుకొచ్చా యి. ముఖ్యంగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితి ని ఆసరాగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా తమ విషప్రచారంతో కేసీఆర్‌ పనితీరును బద్నాం చేసి, ప్రజలను గందరగోళపరిచి ఓట్లను రాబట్టుకోవాలని చాలానే ప్రయ త్నం చేశాయి. అయినా వారి పాచికలేవీ పారలేదు. సెం టిమెంట్లూ, మోదీ ప్రాబవం బలంతో హుజూర్‌నగర్‌లో పాగా వేసి తద్వారా ఏకంగా తెలంగాణలోనే పాగా వేయాలని కలలుగన్నది. కానీ వారి ఆశలన్నీ అడియాశలు చేస్తూ హుజూర్‌నగర్‌ ప్రజలు ప్రగతికి, ప్రజాసంక్షే మ పాలనకే పట్టంగట్టి అవకాశవాద రాజకీయాలను తిరస్కరించారు. అవకాశవాద రాజకీయాలకు గుణపా ఠం చెప్పారు.

అయితే ఈ సందర్భంగా ఈ పార్టీలు చేసిన హడావు డి అంతాఇంతా కాదు. కాంగ్రెస్‌ అయితే తమకు పెట్టని కోటగా ఉన్న హుజూర్‌నగర్‌లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని సర్వశక్తులూ ఒడ్డింది. సెంటిమెం ట్‌ బలంతో గెలుచుకోవాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన భార్య పద్మావతిని బరిలో నిలిపి పెద్ద ఆశలే పెట్టుకున్నా రు. మరోవైపు బీజేపీ అయితే రాబోయేకాలంలో అధికారంలోకి వచ్చేది తామేనని గొంతుచించుకున్నారు.

హుజూర్‌నగర్‌లో తమ ఓటు బలాన్ని నిరూపించుకొని భవిష్యత్తుకాలానికి బాటలు వేయాలని అత్యాశపడ్డారు. ఈ రాజకీయ ఎత్తుగడలన్నింటీని చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు తుత్తునియలు చేశారు. కాంగ్రెస్‌నూ, బీజేపీని చిత్తుగా ఓడించి వారి స్థానమేంటో చాటిచెప్పా రు. ఇక్కడ గమనించాల్సిందేమంటే..

హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో బీజేపీ ఉన్న సభ్యత్వం కన్నా తక్కువ ఓట్లు వచ్చాయని ప్రచారమాధ్యమాలే రాశాయి. అంటే వారి సత్తువ, సిద్ధాంతబలం ఏపాటిదో తేలిపోతూనే ఉన్నది. అయితే దేశవ్యాప్త పరిస్థితిని ఆసరా చేసుకొని రాష్ట్రం లో మతోన్మాదశక్తులు ప్రాపకం పెంచుకోవటానికి తెగ ఆరాటపడుతున్నాయి. తరతరాల నుంచి అణగారిన కులాలను అణగదొక్కిన మతోన్మాద భావజాల శక్తులు ఎలాగైనా తెలంగాణను కబళించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలన్నా, హక్కులను నిలుపుకోవాలన్నా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా ‘అమ్మలను పీడించి ఆవులను పూజించే’ శక్తులకు అడ్డుకట్టవేయక తప్పదు. ఇది ప్రజల అవసరం. ముఖ్యంగా అణగారిన కులాలు, మైనారిటీ మతాలకు చెందిన ప్రజలకు అత్యవసరం. రాష్ట్రం కమలనాథుల కబంధహస్తాల్లో చిక్కుకుంటే ప్రజ ల జీవితాలు మళ్లీ పాతకాలపు భూస్వామ్య రంపపుకోతల హింసారాజ్యం తాండవమాడుతుంది.

మతాధారిత రాజకీయాలను మన రాజ్యాంగం అం గీకరించదు. మతోన్మాద రాజకీయాలను అస్సలు అంగీకరించదు. కానీ, ఇప్పుడు దేశంలో అధికారం వెలగబె డుతున్న శక్తులు మతోన్మాద రాజకీయాలనే ఊపిరిగా చేసుకున్నాయి. మతవిశ్వాసానికి మతోన్మాదానికి మధ్య ఉన్న తేడాను చెరిపేసి, మత విశ్వాసాలను మాయచేసి మతోన్మాదంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

నిజానికి, మత విశ్వాసానికి మతోన్మాదానికి కేసీఆర్‌కు కమలనాథులకు మధ్య హస్తిమశకాంతరం తేడా ఉం ది. మత విశ్వాసంలో ఇతరులపై ద్వేషం ఉండదు. విశ్వాసం సోదరభావం పెంపొందించుకోమంటుం ది. కానీ, మతోన్మాదం అణగారిన కులాలను, అన్య మతస్తులను ద్వేషించమంటుంది.

అణగదొక్కమంటుంది, అంతం చేయమంటుం ది. ఈ నేపథ్యంలోంచే ఇప్పుడు దేశంలో అణగారిన కులాలు, అన్య మతస్తులపైన ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో మనం చూస్తు న్నాం. వాళ్లు తినమన్న తిండి తిననందుకు, కట్టమన్న బట్ట కట్టనందుకు, మొక్కకూడదన్న దేవుడిని మొక్కినందుకు, ప్రేమించకూడదన్న అమ్మాయిని ప్రేమించినందుకు ఆత్మగౌరవంతో బతుకు తామన్నందుకు, ఒక్క మాటలో చెప్పాలంటే మేం బానిసలు గా బతుకలేమన్నందుకు అణగారిన కులాలకు, అన్యమతస్తులను బలి తీసుకుంటున్నారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా ఇదే హింస.

ఇదే దౌర్జనం, అణిచివేత. దేశమే ఒక ఆరుబయలు కారాగారం. రాజకీయాలు వేరు. హిందూ మతోన్మాద రాజకీయా లు వేరు.

రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారుగాని, శత్రువులుండరు. కానీ హిందూ మతోన్మాద రాజకీయం ఆగర్భశత్రుత్వంతోనే ఆరంభమవుతుంది. కొందరి పుట్టుకే వారికి శత్రువు స్థానాన్ని కట్టబెడుతుం ది. ఇదే హిందూ మతోన్మాద, మనువాద రాజకీయం.

హిందూ మతంలో శూద్రులు, అతిశూద్రులు మొత్తం జనాభాలో 95 శాతం ఉన్నారు కాబట్టి, వారి అనుగ్ర హం లేకుండా అధికారం అందుకోవడం, ఆధిపత్యం చెలాయించడం అసాధ్యం. కాబట్టి కొందరిని ఉత్సవ విగ్రహాల్లా చేసి ఊరేగిస్తున్నది. ఆత్మగౌరవం లేని జీవితం, భావప్రకటనా స్వేచ్ఛలేని జీవితం బానిసత్వంతో సమానం. సంఘ్‌పరివారం ఈ రెండింటిమీదే దెబ్బకొడుతున్నది.

ఎంతగా అంటే, ప్రజాస్వామ్యంపై, భావప్రకటనా స్వేచ్ఛపై దేశంలో జరుగుతున్న దాడిని భరించలేక శశికాంత్‌ సెంథిల్‌, కన్నన్‌ గోపినాథన్‌ అనే ఇద్దరు యువ ఐఏఎస్‌ అధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామా ఇచ్చే దుస్థితి దాపురించింది. తెలంగాణ సమాజం కూడా సామాజిక కదలిక లో మొత్తం భారత సమాజానికే ఆదర్శంగా నిలిచింది. ఆ చైతన్య పునాదుల్లోంచే బీజేపీ హుజూర్‌నగర్‌లో ప్రజా తిరస్కరణకు గురైంది. రాష్ర్టాభివృద్ధికీ, పైరుపచ్చ ల తెలంగాణ కోసం కేసీఆర్‌ లాంటి సర్వమత ప్రేమికు డూ మానవతావాది అవసరం. ఈ చారిత్రక నేపథ్యంలోంచే కమలాన్ని రాష్ట్రంలో అడ్డుకోవడం మనందరి కర్తవ్యం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*