బాలయ్య చిత్ర షూటింగ్ కు బ్రేక్ పడేలా చేసిన గ్రామస్థులు

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ మే 28 న వరల్డ్ వైడ్ గా పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వికారాబాద్ ప్రాంతంలో జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ షూటింగ్ కు షాక్ ఇచ్చారు అక్కడి జనాలు. వికారాబాద్‌ మండలం కొటాలగుడెం గ్రామ పరిధిలో సినిమా చిత్రీకరణ చేయరాదని, షూటింగ్ వల్ల తమ భూములు పాడవుతున్నాయని కొటాలగూడ గ్రామస్తులు షూటింగ్ అడ్డుకున్నారట. దీంతో చిత్ర యూనిట్ వెనక్కు వెళ్లాల్సి వచ్చిందని సమాచారం.

ఇక ఇదిలా ఉంటె ఈ మూవీ కి గాడ్‌ ఫాదర్ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసారని బలంగా తెలుస్తుంది. బాలయ్య ఇమేజ్‌కు, కథకు ఈ టైటిలే సరిగ్గా సరిపోతుందని చిత్రబృందం నిర్ణయించింది. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని అంటున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ ఫై మిర్యాల రవీందర్ నిర్మిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*