బుల్లితెరపై కూడా రఫ్ఫాడించిన ఉప్పెన

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా ఇటీవలే విడుదలైన చిత్రం ఉప్పెన. ఈ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో మనం చూసాం. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను తీసుకొచ్చింది. మీడియం బడ్జెట్ చిత్రాల్లో ఉప్పెన హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. వైష్ణవ్ సరసన హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి కూడా మంచి మార్కులే కొట్టేసింది.

సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సనా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. రీసెంట్ గా ఉప్పెన సాటిలైట్ అండ్ డిజిటల్ రిలీజ్ జరిగింది. ముఖ్యంగా బుల్లితెరపై ఉప్పెన సెన్సేషన్ ను క్రియేట్ చేసింది.

ఫస్ట్ స్క్రీనింగ్ లో 18.5 టీఆర్పీ సాధించింది ఈ చిత్రం. ఒక డెబ్యూ హీరోకి ఈ స్థాయి రేటింగ్స్ అంటే అది రికార్డనే చెప్పాలి. నెట్ ఫ్లిక్స్ లో కూడా ఉప్పెన టాప్ లో ట్రెండ్ అవుతుండడం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*