బెడ్ కే పరిమితమైన బిగ్ బాస్ బ్యూటీ

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఐస్‌క్రీమ్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన తేజస్వీ మదివాడ బిగ్ బాస్ సీజన్ 2లోను పాల్గొంది. ఈ కార్యక్రమంలో తేజస్వీ చేసిన హంగామాకు కొంత ప్లస్ , మైనస్ అయింది.

అయితే బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చాక ఈ అమ్మడికి పలు ఆఫర్స్ వచ్చినప్పటికీ ఏవీ కూడా కెరియర్‌కు పెద్దగా ఉపయోగపడలేకపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాని నమ్ముకున్న తేజస్వీ అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో నెటిజన్స్‌ను అలరిస్తూ ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు కాలికి పెద్ద కట్టు కట్టుకొని బెడ్‌పై పడుకున్న ఫొటో షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. కాలికి ఎలా గాయమైంది, అంతలా ఏమైంది అంటూ నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తేజస్వీ మాత్రం వీటికి సమాధానం ఇవ్వక తన అభిమానులుని తెగ టెన్షన్ పెడుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*