బ్రాయిలర్ చికెన్ బాగా తింటున్నారా..? ఇది తెలిస్తే ఆ పని చేయరు.!

వారాంతాలు, సాధారణ రోజులు అన్న సంబంధం లేకుండా.. చికెన్ ఎడా పెడా లాగించేస్తున్నారా ? అయితే జాగ్రత్త. ఎందుకంటే.. ఇప్పుడు మేం చెప్పబోయే విషయం తెలిస్తే మీరు ఇకపై చికెన్ తినేందుకు భయపడతారు. అవును, విషయం అలాంటిది మరి. ఇంతకీ అసలు సంగతేంటంటే.. మనం చాలా వరకు బ్రాయిలర్ చికెన్ తింటున్నాం కదా. ఆ కోళ్లను ఫాంలలో బాగా దాణా పెట్టి పెంచుతారు. అందుకే ఆ కోళ్లు బాగా బరువు పెరుగుతాయి. అయితే దాణాతోపాటు కోళ్ల పెంపకం దారులు కోళ్లకు యాంటీ బయోటిక్ ఇంజెక్షన్లను కూడా ఇస్తారు. దాని వల్ల కోళ్లు రోగాలకు తట్టుకుని మరింత పెరుగుతాయి. అయితే ఇలా యాంటీ బయోటిక్స్ ఇచ్చి పెంచబడిన కోళ్లను తినడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు వస్తాయని తేలింది.

ది హిందూ, ది బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం అనే సంస్థలు ఇటీవలే ఓ పరిశోధన చేశాయి. అదేమిటంటే… యాంటీ బయోటిక్ ఇంజెక్షన్లు వేసి పెంచబడిన కోళ్లను తినడం వల్ల మనలో ఇన్ఫెక్షన్లు వస్తున్నాయట. అలాగే ఆ ఇన్‌ఫెక్షన్లను తట్టుకునేందుకు యాంటీ బయోటిక్ మందులను ఇచ్చినా ఫలితం ఉండడం లేదట. ఈ క్రమంలో బాక్టీరియా, వైరస్‌లు కూడా మనం వాడే యాంటీ బయోటిక్‌, యాంటీ వైరల్ మందులకు తట్టుకుని రోజు రోజుకీ మరింత బలవంతమవుతున్నాయట. అలాగే యాంటీ బయోటిక్ మందులను వాడి పెంచబడిన కోళ్లను తినడం వల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చి మన దేశంలో ఏటా 1 లక్ష మంది చిన్నారులు, 7 లక్షల మంది పెద్దలు చనిపోతున్నారని పరిశోధనలో తెలిసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*