మన మంచి బ్యాక్టీరియా!

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి విటమిన్స్‌, మినరల్స్‌ సమపాళ్లలో అందాలి. వాటితోపాటు ‘ప్రోబయాటిక్స్‌’ వంటి మంచి బ్యాక్టీరియా కూడా అవసరం. రకరకాల అలర్జీలు, ఆర్థరైటిస్‌, మానసిక ఒత్తిడి, జీర్ణకోశ సమస్యలు, ఎసిడిటీ, అధిక రక్తపోటు, క్యాన్సర్‌ వంటి ఎన్నో సమస్యలను ప్రోబయాటిక్స్‌ నిరోధిస్తాయి. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి సహజంగానే వచ్చేస్తుంది. కానీ, కొందరికి సప్లిమెంట్స్‌ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది.

పెరుగు : స్వచ్ఛమైన పాలతో తోడు పెట్టిన పెరుగును ఆహారంలో తీసుకోవాలి. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ‘కాలనీ ఫార్మింగ్‌ యూనిట్స్‌’ (సీఎఫ్‌యూ) పుష్కలంగా ఉంటాయి.

చద్దన్నం : వండిన అన్నాన్ని రాత్రంతా నీళ్లతో నానబెట్టి, ఉదయాన్నే తింటే మంచి బ్యాక్టీరియా సమపాళ్లలో శరీరానికి అందుతుంది. దీనివల్ల ఎలాంటి జీర్ణ సమస్యలైనా దూరమవుతాయి.

యాపిల్‌ సైడర్‌ డ్రింక్‌ : సహజంగా పులిసిన అన్‌పాశ్చరైజ్డ్‌ సైడర్‌ వెనిగర్‌వల్ల ఎన్నో లాభాలున్నాయి. ముఖ్యంగా ఒక చిన్న మూతనిండా సైడర్‌ని యాపిల్‌ జ్యూస్‌లో కలిపి తాగాలి. ఇందులో కొద్దిగా దాల్చిన చెక్కపొడి వేసుకుంటే ఇంకా మంచిది.

చీజ్‌ : నిల్వ చేసిన చీజ్‌లో ప్రోబయాటిక్స్‌ పుష్కలం. చీజ్‌ను రోజూ కొద్దికొద్దిగా ఆహారంలో భాగం చేసుకోవాలి.

కెఫిర్‌ : దీన్ని ప్రోబయాటిక్‌ రిచ్‌ డ్రింక్‌గా చెప్పాలి. ధాన్యాలతోనూ కెఫిర్‌ను తయారు చేయవచ్చు. కొకొనట్‌ కెఫిర్‌, రైస్‌ మిల్క్‌ కెఫిర్‌ మొదలైన నాన్‌ మిల్క్‌ లిక్విడ్స్‌లో నచ్చిన పండ్లు, కూరగాయల ముక్కలు, దాల్చిన చెక్కపొడి, వెనిలా ఎసెన్స్‌ కలుపుకొని తాగాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*