రాజకీయ రాముడు

ఆసియా ఖండం దేశాల మధ్య చిచ్చుపెట్టి తమాషా చూడటం, వీలైనంతవరకు లాభపడటం మొదటినుంచి అమెరికా తదితర పాశ్చాత్య దేశాల కుటిల నీతి. ఇదే కుటిలనీతి ఇంకా కొనసాగుతున్నది. నాడు బ్రిటిష్ పాలకులు ఇండియాను ముక్కలుచేయడానికి మొహమ్మద్ అలీ జిన్నా మతోన్మాదానికి మద్దతు ఇచ్చారు. ఈ రోజు కశ్మీరును భారత్ అంతర్గత సమస్యగా పరిగణిస్తున్న అమెరికా, పాశ్చాత్య దేశాలు హాంకాంగ్‌ను చైనా అంతర్గత సమస్యగా ఎందుకు పరిగణించడం లేదు? మన దేశం ఈరోజు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక తిరోగమనం, మాంద్యం నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించడానికి 370 వంటి మత్తుమందు ఏదో ఒకటి ఉండాలె. నోట్లరద్దుతో మంచిరోజులు వస్తాయని కొంతకాలం గడిపారు. 370 రద్దు తర్వాత రద్దుల పర్వం ముగుస్తుందనుకుంటే పొరపాటు.

త్రేతాయుగ శ్రీరామావతారానికి కాలదోషం లేనట్లున్నది-మహారావణ మర్దనం, సంహారంతో, అరణ్యవాసంతో, సీతమ్మవారి కష్టాలతో శ్రీరామావతారం విధి నిర్వహణ అధ్యా యం ముగియనట్లుంది. రాముడు పేరిట ఎన్ని సిత్రాలు, ఎన్ని చిత్రాలు, ఎన్ని విచిత్రాలు! విశేషించి తెలుగు చలనచిత్ర రంగంలో రాముడికి ఎన్నో వేషాలు, అనేక రూపాలు-అగ్గిరాముడు, అడవి రాము డు, అందాల రాముడు, బండ రాముడు, దొంగ రాముడు-ఇంకెందరు రాములు వస్తారో తెలియదు. వేచి చూడవలసిందే, వేయి కన్నులతో.

త్వరలో, అతిత్వరలో రాబోతున్నది అయోధ్య రాముడు చిత్రం. స్క్రిప్టు రెడీ, ప్రొడక్షన్ ఏర్పాట్లన్నీ పూర్తయినాయి, తారాగణం రంగులద్దుకొని రెడీగా నిల్చున్నది. అయోధ్య చక్రవర్తి గనుక కొన్ని అక్షౌహిణుల సైన్యం ముందు మోహరించిన పిదప, ఎటువంటి విఘ్నాలు కలుగకుండా ముందు అన్ని ఇండ్లకు, అన్ని నోళ్లకు తాళాలు వేయగానే అయోధ్య రాముడు చిత్ర నిర్మాణం ప్రారంభమవుతుంది-తీర్పులు, ఆర్పులు, అరుపులు ఏవీ అడ్డంకి కాబోవు. తీర్పుల దారి చెత్తబుట్టలోకి; శరవేగం తో చిత్ర నిర్మాణం పూర్తవుతుంది.

ఆదికవి వాల్మీకి సాక్షాత్కరింపజేసిన రాముడు కేవలం మానవమాత్రుడైన అమాయక రాముడని పెద్దలు అం టారు. రాముడు నిజంగానే రాజకీయాల రంగు, రుచి, కపట నాటకాలు, కుళ్లు, కుట్రలు ఏవీ తెలియని వాడు-అధికార వ్యామోహం అసలే లేనివాడు. తండ్రి చెప్పకముందే, తండ్రికి చిక్కులు లేకుండా వెంటనే అరణ్యవాసానికి బయల్దేరాడు. వెంట తెచ్చుకున్న పాదుకలను సైతం తమ్మీ అని పిలిచి ప్రేమతో భరతుడికి ఇచ్చేశాడు.

అటువంటి రామయ్య తండ్రి ఈ రోజు చిల్లర రాజకీయాల పాచిక కావడం శోచనీయం. సంభ్రమాశ్చర్యాలకు, దిగ్భ్రాంతికి అందరలవాటు పడుతున్నారు. ఒక దిగ్భ్రాంతి నుంచి కోలుకోకముందే మరో దిగ్భ్రాంతి. ఇటీవలి ఎన్నికల ఫలితాలు రాగానే ప్రధాని మోదీజీ ప్రామిస్ చేసిన నవభారత నిర్మాణంలో (అన్ని ప్రామిస్‌లు ఒకేతీరుగా ఉండవు.

2014 ఎన్నికలప్పుడు ప్రామిస్ చేసిన రూ.15 లక్షలు ఇప్పటికీ జేబులో పడలేదని ఎవరూ దిగులుపడొద్దు. దానిదారి దానిది, దీనిదారి దీనిది, దేనిదారి దానిది) భాగంగా ఒకే దేశం, ఒకే నేషన్-కలైనేషన్ కాదు-ఒకే ప్రజ నినాదానికి అనుగుణంగా, అంబేద్కర్ చొరవతో వచ్చిన రిజర్వేషన్ల అధ్యాయం త్వరలో ముగిస్తే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎవరైనా, ఆశ్చర్యపడినా, ఆవేశపూరితులై నోరువిప్పి నిరసన తెలిపినా శాంతిభద్రతలకు, జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించినవారవుతారు. ఈ మధ్య, చర్చల జోలికి ఎంతమాత్రం పోకుండా పార్లమెంట్ ఆమోద ముద్ర వేసిన నేషనల్ ఇన్‌వెస్టిగేషన్ ఏజెన్సీ చట్టం సవరణ గురించి తెలిసినవారెవరూ నోరు విప్పి నిరసన తెలుపడానికి సాహసించరు.

నవభారత నిర్మాణంలో భాగంగా నే తిరిగి విదేశీ పర్యటనలు కొనసాగిస్తున్న రెండవ టర్మ్ ప్రధాని మోదీజీ అందాల నగరం ప్యారిస్‌లో ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌తో సంభాషిస్తూ భారత్ అంతర్గత సమస్య కశ్మీర్ గురించి ప్రస్తావించారు; ప్యారిస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడుతూ (ఈ ఇద్దరు మహా నాయకులు సరససల్లాపాలు జరుపుతున్న ఫొటో ఒకటి భారత మీడియాలో కన్పించింది.) కూడా, బ్రిటన్ ప్రధానితో, జర్మనీ అధ్యక్షురాలితో మాట్లాడుతూ కూడా కశ్మీర్ సమస్య గురించి మోదీజీ ప్రస్తావించారని వార్తలు వచ్చాయి. భారత్ అంతర్గత, ద్వైపాక్షిక సమస్య గురించి ఇతర దేశాల అధినేతలతో చర్చించవలసిన అవసరం ఉందా, ఉందనుకుంటే అది ద్వైపాక్షిక, అంతర్గత సమస్యగా మిగలదు కదా అన్నది సామాన్యుల సందేహం. ఇలా మాట్లాడేబదులు మోదీ-షాలు ఓ రోజు కశ్మీరు వెళ్లి బాబా, మీ మేలు కోసమే, మీ మంచి కోసమే, మీకు మంచిరోజులు రావడానికే ఇంతగా సాహసించి 70 ఏండ్ల నుంచి ఉన్న 370, 35 ఏ ఆర్టికల్స్‌ను రద్దుచేసాం. అన్యధా భావించకండి..

అని తమకు సహజ భూషణాలైన అనర్గళ, గంభీర ప్రసంగాలతో వివరించినట్లయితే కోట్లాది రూపాయల భారీ వ్యయంతో కశ్మీరులో పది లక్షల మంది సాయుధ బలగాలను మోహరించవలసిన అవసరం ఉండకపోయేది; కశ్మీరుకు గోలకొండ తాళాలు వేసి కోటిమంది ప్రజల గొంతు నొక్కవలసిన అవసరం ఏర్పడకపోయేది, మూడువారాల నుంచి కశ్మీరు ప్రజల దైనందిన సాధారణ జీవితం స్తంభించకపోయేది, భారత్ హిందూ పాలకులు కశ్మీరు ప్రజల ప్రాథమిక, మానవ హక్కులకు విఘాతం కల్పించి మంటగలిపారని పాక్ పాలకులు ఎవరు కన్పిస్తే వారికి చెప్పి గగ్గోలు చేయగలిగేవారు కాదు. ఈ దేశంలోని 11 మంది ప్రతిపక్ష నాయకులు అడుగు పెట్టగానే కశ్మీరులో, శ్రీనగర్‌లో నిరసనాగ్నులు ఎగసిపడుతాయని మోదీజీ ప్రభు త్వం భయపడవలసిన పరిస్థితి ఉత్పన్నం కాకపోయేది. ప్యారిస్‌లో మోదీజీతో అన్నీ మాట్లాడాను, కశ్మీరు గురించి కూడా మాట్లాడాను.. ట్రంప్ అన్నాడు.

అమెరికాలోని భారతీయులు ట్రంప్ హయాంలో ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యల గురించి మోదీజీ ఎన్న డైనా ట్రంప్‌తో మాట్లాడారా? కరచాలనాలు, కౌగిలింతలు ముఖ్యం కావు. అవి కడుపు నింపలేవు, అమెరికాలోని భారతీయుల సమస్యలను పరిష్కరించలేవు. అమెరికా అమెరికన్లదే, అమెరికా అమెరికన్ల కోస మే వంటి దుష్ట నినాదాలతో ట్రంప్ యూఎస్‌ఏలో భారతీయులను కష్టాల కొలిమిలో దింపి ముందెన్నడూలేని ఆందోళనకు గురిచేస్తున్నాడు.

హెచ్1 వీసాలు, గ్రీన్‌కార్డుల విషయంలో ట్రంప్ ధోరణి, ఆయన మాట లు అక్కడి భారతీయులకు అమిత ఆందోళన కలిగిస్తున్నాయి. టెర్రరిజం భయంకర సమస్యే. కానీ, అదొక్కటే సమస్య అనుకోవడం పొరపాటు. భారతీయులకు యూఎస్‌ఏలో పుట్టిన బిడ్డలు అక్కడ సహజపౌరులు కాకుండా చేస్తానని ఈ మధ్యనే ట్రంప్ కొత్త పేచీ పెట్టాడు.

అమెరికాలో ని భారతీయుల సమస్యలు, ఇక్కట్ల గురించి మోదీజీ ఎన్నడైనా ట్రంప్ తో మాట్లాడారా? ఏదేమైనా ఇండియాకు 400 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతుల ఒప్పందం చేసుకొని ట్రంప్ ఇంటికి వెళ్తున్నాడు. మోదీ, ఇమ్రాన్ ఇద్దరూ తనకు మంచి మిత్రులని ట్రంప్ అన్నాడు. ఆసియా ఖండం దేశాల మధ్య చిచ్చుపెట్టి తమాషా చూడటం, వీలైనంతవరకు లాభపడటం మొదటినుంచి అమెరికా తదితర పాశ్చాత్య దేశాల కుటిల నీతి.

ఇదే కుటిలనీతి ఇంకా కొనసాగుతున్నది. నాడు బ్రిటిష్ పాలకులు ఇండియాను ముక్కలుచేయడానికి మొహమ్మద్ అలీ జిన్నా మతోన్మాదానికి మద్దతు ఇచ్చారు. ఈ రోజు కశ్మీరును భారత్ అంతర్గత సమస్యగా పరిగణిస్తున్న అమెరికా, పాశ్చాత్య దేశాలు హాంకాంగ్‌ను చైనా అంతర్గత సమస్యగా ఎందుకు పరిగణించడం లేదు? హిందుత్వ ప్రభుత్వాలు, పాలకులు, విధానాల పట్ల పాశ్చాత్య దేశాలకు, యూఎస్‌ఏకు సానుభూ తి ఉంటుందనుకోవడం భ్రమ.

ప్రపంచమంతటా ముస్లింల సంఖ్య హిం దువుల సంఖ్య కంటే ఎక్కువే కాని తక్కువ కాదు. పాకిస్థాన్‌ను అందరు వెలివేశారని భారతీయ దేశభక్తులు సంబురపడుతున్నారు. భుక్తి కంటే దేశభక్తి ముఖ్యమన్నది ఇవాళ్టి మన నినాదం. మన దేశం ఈ రోజు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక తిరోగమనం, మాంద్యం నుంచి దేశ ప్రజల దృష్టి ని మళ్లించడానికి 370 వంటి మత్తుమందు ఏదో ఒకటి ఉండాలె.

నోట్ల రద్దుతో మంచిరోజులు వస్తాయని కొంతకాలం గడిపారు. 370 రద్దు తర్వాత రద్దుల పర్వం ముగుస్తుందనుకుంటే పొరపాటు. దేశమంతా సమానరీతిలో అభివృద్ధి జరుగాలంటే ఫెడరల్ వ్యవస్థను రద్దుచేయాలంటారు, రిజర్వేషన్లు రద్దుచేయక తప్పదంటారు, మారిన పరిస్థితిలో భార త రాజ్యాంగానికి కాలదోషం పట్టిందంటే నోరు తెరువొద్దు! ఇవి కేవలం కనీసంగా జరుగనున్న రద్దులు మాత్రమే.

1865 ఏప్రిల్ 4 నాడు ఒక రేసిస్టు-జాతి దురహంకారం, ద్వేషం, పగ, కసి ప్రకోపించిన ఉన్మాది-తుపాకి గుళ్లకు బలైన స్వాతంత్య్ర పిపా సి, మానవతావాది, యూఎస్‌ఏ 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ అన్నాడు. No man is good enough to govern another man without the others consent…As I would not be a slave, so I would not be a master. This expresses my idea of democracy… నిరంకుశ పాలన దుశ్చర్యలకు గురై నిర్బంధంలో ఉన్నప్పుడు కొందరికి కాలక్షేప మార్గం కన్పించదు, సృజనాత్మక కార్యకలాపాల్లో మునిగి తేలేవారికి సమయం చాలదనిపిస్తుంది.

భారత స్వాతంత్రోద్యమంలో జైలుశిక్షలు అనేక ఏండ్లు అనుభవించిన ప్రముఖులు కొందరు గ్రంథ పఠనం, రచనలో నిమగ్నమైనారు. లోక్‌మాన్య బాలగంగాధర తిలక్ మాండలే జైలులో ఉన్నప్పుడు అత్యంత మహిమాన్వితమైన భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించి అమూల్యమైన వ్యాఖ్యానం రచించారు. ఉరిశిక్ష, తేది, సమయం కోసం ఎదురుచూస్తూ యువ విప్లవకారుడు భగత్‌సిగ్ మార్క్సిజం అధ్యయనం జరిపాడు. పదకొండేండ్లు జైలులో ఉన్న నెహ్రూ అనేక గ్రంథాలు పఠించి, మిత్రులతో చర్చల ద్వారా విజ్ఞానం ఆర్జించి అమూల్య గ్రంథాలు రచించారు.

ఆయ న పేరు వింటే భగ్గుమంటున్నవారు ఆయన గ్రంథాల పఠనాన్ని ఆపివేయలేరు. ఇందిర ఎమర్జెన్సీలో అరెస్టయి జైలులో ఉన్న జయప్రకాశ్ అనారోగ్యంతో బాధపడుతున్నా జైలు డైరీ రచించారు. బ్రిటిష్ పాలకులు రంగూన్ జైలులో నిర్బంధించిన చివరి మొగలు చక్రవర్తి, 1857 ప్రథమ స్వాతంత్య్ర సమరం నాయకుల్లో ఒకడైన బహద్దుర్ షా జఫర్ తన షాయిరీ (ఉర్దూలో కవితల రచన) ఆపలేదు. నెహ్రూ, అబ్దుల్ కలాం ఆజాద్ తదితరులు అహ్మద్‌నగర్ జైలులో ఉన్నప్పుడు (ఆజాద్ ఆ జైలులోనె గుబారె ఖాతిర్ గ్రంథాన్ని రచించారు). కల్హణ మహాకవి రాజతరంగిణి (ఇది కల్హణుడు 12వ శతాబ్దంలో రచించిన సంస్కృత గ్రంథం-ప్రాచీన కశ్మీరు చరిత్ర) గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించిన రంజిత్ పండిత్ కశ్మీరు చరిత్రను వివరించేవాడు. ఇది మా అంతర్గత విషయం అని ఎవరెంత బల్ల గుద్దిచెప్పినా ట్రంప్ మొదలుకొని జంప్ వరకు ప్రపంచమంతటా అందరికీ ఈరోజు చర్చనీయాంశం అవుతున్నది కశ్మీరు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*