రాణిస్తున్న పట్టు పరిశ్రమ

రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన రైతులతో పాటు పట్టు రైతుల జీవితా ల్లో వెలుగులు నింపడం కోసమే ప్రభుత్వం అన్ని శాస్త్రీయ, విధాన ప్రోత్సాహకాలు అందిస్తున్నది. అన్నిరంగాల్లో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు రైతుల ఆదాయాలు పెంచడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నది. పట్టుపరిశ్రమ ఉజ్వల భవిష్యత్తుకు రాబోయేకాలంలో తెలంగాణ రాష్ట్రం చిరునామా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
వ్యవసాయ, అనుబంధ రంగాల్లో తనదైన ముద్రవేస్తున్న తెలంగాణ రాష్ట్రం మరో అవార్డు అందుకున్నది. వంద శాతం బైవోల్టిన్ పట్టు ఉత్పత్తికి కేంద్ర బిందువుగా నిలిచింది. అత్యుత్తమ బైవోల్టిన్ పట్టు ఉత్పత్తి చేసే రాష్ట్రంగా జాతీయ అవార్డు సాధించింది.
దేశంలో పట్టు పరిశ్రమకు మొదటినుంచి ఆదరణ ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో 85 లక్షల జనాభాకు ఉపాధి కల్పిస్తున్నది. పట్టు పరిశ్రమ ద్వారా 2022 నాటికి కోటి మందికి ఉపాధి లభించనున్నది. ఇది పది వేల కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న పరిశ్రమ. తక్కువ పెట్టుబడి, అధిక ఉపాధి అవకాశాలు ఉండటం, మేలైన రాబడి ఉన్నది. దీంతో అందరికీ ప్రాధాన్య రంగం ఇది. అయితే నాణ్యమైన బైవోల్టిన్ సిల్క్ పెద్ద మొత్తంలో ఉత్పత్తి కావడం లేదు. దిగుమతుల పైనే ఆధారపడటం, ముడి సిల్క్ ఉత్పాదకత తక్కువగానే ఉన్నది. నాణ్యమైన పట్టు రికవరీ, గ్రేడ్ క్వాలిటీ అంతగా లేకపోవడం పట్టు పరిశ్రమకు అవరోధాలుగా ఉన్నాయి. తెలంగాణ పట్టుపరిశ్రమ సంప్రదాయ రాష్ట్రం కాదు. కానీ వ్యవసాయ, ఉద్యాన రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సాధిస్తున్న విజయాలను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో మల్బరీ, పట్టు ఉత్పత్తులను చరిత్రాత్మక దిశగా నడిపి అద్భుత విజయాలు సాధించగలిగాం. రాష్ట్రం ఏర్పడే నాటికి మొదటగా మల్బరీ విస్తీర్ణం 3,176 ఎకరాలు ఉన్నది. 2018 చివ రినాటికి 10,645 ఎకరాలకు పెంచగలిగాం. ఇందుకు బిందు సేద్యం చాలా ఉపయోగపడింది. అదేవిధంగా 6500 మంది రైతులను సంఘటితపరిచి రైతు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటుచేశాం. ముఖ్యంగా పట్టు గూళ్ల లో బైవోల్టెన్, మల్టివోల్టిన్ అనే రెండు రకాలున్నాయి. ఏ విధంగా చూసినా బైవోల్టిన్ పట్టుగూళ్లు అత్యంత నాణ్యమైనవి. వ్యాపార విలువ కలిగినవి. ఈ పట్టుగూళ్లలో దారం పొడవు, సహజ మెరుపు, నాణ్యత మల్టివోల్టిన్ గూళ కన్నా ఎక్కువగా ఉంటుంది.
దిగుబడి కూడా మల్టీవోల్టిన్ కన్నా అధి కం. బైవోల్టిన్ పట్టుగూళ్ల ధర మల్టివోల్టిన్ కన్నా కిలోకు రూ.100 అధిక ధర ఉంటుంది. దీని ప్రాధాన్యాన్ని గమనించి బైవోల్టిన్ పట్టు ఉత్పత్తిపై దృష్టిసారించాం. రాష్ట్రంలో మల్టివోల్టిన్ పెంచడం తగ్గించి, బైవోల్టిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ వచ్చాం. ఫలితంగా నేటికి వంద శాతం బైవోల్టిన్ పట్టు గూళ్లను ఉత్పత్తి చేయగలిగాం. ఆటోమేటిక్ రీలింగ్ పరిశ్రమలో బైవోల్టిన్ పట్టుగూళ్లను మాత్రమే వాడుతారు. ప్రభుత్వం బైవోల్టిన్ పట్టుగూళ్ల ఉత్ప త్తే ధ్యేయంగా పలు ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నది. పంట కాలనీలుగా విభజించి, ఆ క్లస్టర్లలోని రైతులకు అవగాహన కల్పించాం. వంద కిలో మీటర్ల పరిధిలో చిన్న పట్టు పురుగుల పెంపక క్షేత్రాలు ఏర్పాటుచేశాం.
అంతకుముందున్న సాధారణ రకాలకు బదులుగా అధిక దిగుబడులను ఇచ్చే జీ 2, జీ 4 లాంటి కొత్త మల్బరీ రకాలను హైటెక్ నర్సరీల్లో పెంచి రైతులకు సరఫరా చేస్తున్నాం. మల్బరీ రైతులందరికీ క్యాటగిరీల ప్రకారం వంద శాతం, తొంభై శాతం, 80 శాతం రాయితీపై బిందు సేద్యాన్ని ప్రోత్సహించాం. ఫలితంగా రైతులు నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో కూడా ధైర్యంగా మల్బరీ సాగు చేస్తున్నారు. పట్టుగూళ్ల ఉత్పత్తిదారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఒక్కంటికి రూ.75 చొప్పున ఇస్తున్నది. దేశంలో నే మొట్టమొదటిసారిగా పట్టు పరిశ్రమను ఉపాధిహామీ పథకంతో అనుసంధానం చేశాం. దాంట్లో భాగంగా పట్టపరిశ్రమ శాఖ మల్బరీ సాగుకు ఎకరానికి మూడేండ్ల కాలంలో లక్షా పదమూడు వేల రూపాయ లు, షెడ్ నిర్మాణానికి లక్షా మూడు వేలు గ్రాంట్‌గా ఇస్తుంది. పట్టుగూళ్ల నుంచి దారాన్ని చేయడానికి గతంలో ఒకటే ఆటోమేటిక్ రీలింగ్ పరిశ్రమ ఉం డేది.
బోవోల్టిన్ పట్టుగూళ్ల లభ్యత సైతం పెరిగినందున మరోమూడు ఆటోమేటిక్ రీలింగ్ పరిశ్రమలను స్థాపించే ప్రయత్నం చేస్తున్నాం. పట్టుగూళ్ల విక్రయంలో మధ్య దళారుల ప్రమేయం లేకుండా చేసేందుకుగాను తిరుమలగిరి, జనగామల లో రెండు ప్రభు త్వ విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేశాం. గతేడాది మన రాష్ట్రంలో 2807 మెట్రిక్ టన్నుల గూళ్ల ఉత్పత్తి జరిగింది. దానినుంచి 1106 మెట్రిక్ టన్ను ల పట్టు, గూళ్లు పూర్తిస్థాయిలో వాడుకునే ప్రణాళికలు చేశాం. అందుకే అనుగుణంగా పట్టు రీలింగ్ పరిశ్రమలను తెలంగాణ రాష్ట్రం ప్రోత్సహిస్తున్నది. ప్రస్తుతం ఒక కోటి తొంభై నాలుగు లక్షల మందికి ఏడాది పొడవు నా రాష్ట్రంలో పట్టు పరిశ్రమ ద్వారా ఉపాధి లభిస్తున్నది. రాష్ట్రంలో ఉత్ప త్తి అయ్యే పట్టును రాష్ట్రమే పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటుం ది. ప్రభుత్వం పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట, కొత్తకోటలలో ఉన్న పట్టు మగ్గం నేత పనివారికి అందజేస్తుంది. డిమాండ్ అధికంగా ఉన్న దృష్ట్యా, రాష్ట్రంలో ఎల్కతుర్తిలో బైవోల్టిన్ విత్తన ఉత్పత్తికి ప్రణాళిక రచిం చాం. సేంద్రియ పట్టు ఉత్పత్తికి కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. 300 ఎకరాకలు పైగా విస్తీర్ణంలో 8 పంట పాలనీలు గర్తించాం. మల్బరీ సాగు ను, పట్టు ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాం. ప్రత్యేకించి అటవీ ప్రాంతల్లో సం ప్రదాయ టసార్ ఇండస్ట్రీ ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతి వెయ్యి టసార్ రీలింగ్ పట్టుగూళ్లకు రూ.200 ఇస్తుంది.
రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన రైతులతో పాటు పట్టు రైతుల జీవితా ల్లో వెలుగులు నింపడం కోసమే ప్రభుత్వం అన్ని శాస్త్రీయ, విధాన ప్రోత్సాహకాలు అందిస్తున్నది. అన్నిరంగాల్లో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు రైతుల ఆదాయాలు పెంచడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నది. పట్టుపరిశ్రమ ఉజ్వల భవిష్యత్తుకు రాబోయేకాలంలో తెలంగాణ రాష్ట్రం చిరునామా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*