రాములో రాములా..క్రేజీ టిక్‌టాక్‌ వీడియో

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలోని ‘సామజవరగమన’ పాట ఎలా దూసుకుపోయిందో తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి ‘రాములో రాముల’ సాంగ్‌ దుమ్ము రేపుతోంది. కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తోంది. దీపావళి సందర్భంగా విడుదలైన ‘రాములో రాములా నన్నాగం చేసిందిరో’ ఫుల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇందుకు నిదర్శనంగా ఒక టిక్‌ టాక్‌ వీడియో వేల వ్యూస్‌తో దూసుకుపోతూ క్రేజీ స్టార్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటను కాసర్ల శ్యామ్ ర‌చించగా, తమ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చిన ఈ గీతాన్ని అనురాగ్ కుల‌క‌ర్ణి, మంగ్లీ ఆల‌పించారు. ఇప్పటికే యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న ఈ పాటకు సంబంధించి తాజా టిక్‌టాక్‌ వీడియో  సంచలనం సృష్టిస్తోంది.  ఈ టిక్‌ టాక్‌ వీడియోను తమన్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. సినిమా విడుదలకు ముందే అంచనాలను భారీగా పెంచేస్తున్న పాటలపై స్వరకర్త తమన్‌  ఫుల్‌ ఖుషీ గా ఉన్నారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*