
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా దాదాపు సగం జనాభా ప్రధాన ఆహారం రైస్. ఆధునిక గజిబిజి జీవితంలో అసలు అన్నం కంటే గోధుమలు, జొన్నలు మంచివా పండ్లతోనే భోజనం అయిందనిపించడం మేలా వంటి అనేక అనుమానాల మధ్య అన్నమే మిన్న అంటూ నిపుణులు చెబుతున్నారు. ఇక తెలుపు రంగులో ఉండే బియ్యం కంటే బ్రౌన్ రైస్ మంచిదనే ప్రచారమూ సాగుతుండగా రైస్ ఏ వర్ణంలో ఉన్నా ఆరోగ్యానికి మేలేనన్నది నిపుణుల మాట. బియ్యంతో ఎన్నో రకాల వంటలు చేసి ఆరగించడంతో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చని అంటున్నారు. అయితే ప్రాసెస్ చేయని రైస్ మంచిదని సూచిస్తున్నారు.
శక్తికి మూలం
అలసట, ఆకలి తీవ్రంగా ఉన్నప్పుడు కొద్దిగా రైస్ తీసుకున్నా తక్షణ శక్తి లభిస్తుంది. రైస్‌లో ఉన్న కార్బోహైడ్రేట్లు శక్తిగా మారి మనకు నిస్సత్తువను పోగొడతాయి. రైస్ మన శరీరానికి శక్తి ఇవ్వడంతో పాటు ఎలాంటి అలసట లేకుండా బ్రైన్ సమర్థంగా పనిచేసేలా చూస్తుంది.
జీర్ణశక్తి
రైస్ తేలిగ్గా అరుగుతూ జీర్ణ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. రైస్‌లో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. మన శరీరంలో ఉన్న మలినాలను తొలగించడంతో పాటు డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది
స్థూలకాయానికి చెక్
ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడంలో రైస్‌కు దానికదే సాటి. ఓ కప్పు రైస్‌తో శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఇందులో తక్కువ స్ధాయిలో ఉండే సోడియం, కొలెస్ట్రాల్‌లు బరువు పెరగడాన్ని నిరోధిస్తాయి. అన్నం బరువుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు. రైస్‌లో ఉండే ఫైబర్ ఒబెసిటీని నియంత్రిస్తుంది.
గుండె ఆరోగ్యానికి మేలు
రైస్ వాడకం గుండెకు మేలు చేస్తుంది. ఇందులో ఉండే వాపు నివారించే గుణాలతో పాటు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆరోగ్యకరమైన గుండెకు రైస్‌బ్రాన్ ఆయిల్ ఉపకరిస్తుంది. రైస్‌లో ఉండే యాంటీఆకక్సిడెంట్ గుణాలు కార్డియోవాస్క్యులర్ ఆరోగ్యానికి దోహదపడతాయి.
రక్తపోటు, మధుమేహానికి చెక్
అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడేవారికి రైస్ సరైన ఆహారం. రైస్ తీసుకోవడం ద్వారా రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ఈ రెండు జీవనశైలి వ్యాధులతో ఇబ్బందిపడేవారు ఒక బౌల్ రైస్‌తో వీటిని దీటుగా ఎదుర్కోవచ్చన్నది నిపుణుల మాట
Leave a Reply