లవ్ స్టోరీ యూనిట్ కోసం భారీ ఖర్చు..

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉన్నా సరే మాస్క్ వేసుకుని ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.. అయినా సరే ఒక పక్కన సినిమా వాళ్ళు షూటింగ్స్ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. షూటింగ్ సేఫ్ కాదని ఒకపక్క ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా లవ్ స్టోరీ సినిమా షూటింగ్ కి సంబంధించిన వివరాలు కాస్త ఆసక్తికరంగా మారాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ.. నిజానికి ఈ సినిమా 16వ తేదీన విడుదల కావలసి ఉంది. కానీ థియేటర్ల మూసివేత గురించి ముందే ఊహించిన సినిమా నిర్మాతలు ఈ సినిమాని వాయిదా వేశారు.

ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూసే సినిమా కాబట్టి అలా కలిసి కూర్చుని చూసే పరిస్థితులు వచ్చాక రిలీజ్ చేస్తామని చెప్పారు.. ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక్కరు కూడా కరోనా బారిన పడ లేదట. షూటింగ్ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉన్నారని చెబుతున్నారు. కరోనా నిబంధనల నేపథ్యంలో కేవలం వంద మంది తోనే షూటింగ్ జరిపామని, సెట్ లో ఉన్న అందరికీ ప్రతి రోజు పౌష్టికాహారం అందజేస్తూ గుడ్లు, పాలు, విటమిన్ టాబ్లెట్లు, క్రమం తప్పకుండా అందించారట.

ఎవరికైనా లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే వెంటనే అప్పటికప్పుడు కరోనా టెస్టులు చేయించారని తెలుస్తోంది. అంతేకాక దాదాపు పని చేస్తున్న అందరికీ ఒక్కొక్కరికి మూడు లక్షలు ఇన్సూరెన్స్ పాలసీ కూడా చేయించారని తెలుస్తోంది. ఇవన్నీ చేసేందుకు గాను అదనంగా 50 లక్షల వరకు ఖర్చు అయింది కానీ ఇంత ఖర్చు అయినా యూనిట్ లో ఒక్కరు కూడా కరోనా బారిన పడకుండా సినిమా పూర్తి చేసే అవకాశం వచ్చిందని చెబుతున్నారు. ఇప్పుడు షూటింగ్ జరుగుతున్న సినిమాల్లో యూనిట్లు కూడా లవ్ స్టోరీ యూనిట్ ఫాలో అయిన పద్ధతినే ఫాలో అయితే పెద్దగా కరోనా ఇబ్బందులు కూడా ఉండవని అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*