సమగ్ర విత్తన చట్టం రావాలె

ఉమ్మడి రాష్ట్రంలో జరిగినట్లుగానే రాష్ట్రంలో ప్రత్యేక విత్తన చట్టం రూపకల్పనకు ప్రయత్నించినా కేంద్రం ఒప్పుకోలేదు. అయితే రాష్ట్రంలోని రైతులకు కల్తీ విత్తనాల వల్ల నష్టం జరిగితే పరిహారం ఇచ్చే అవకాశాన్ని పత్తి వంటి పంటలకు రాష్ట్రం ఇప్పటికే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసింది. కేంద్రం కూడా ఈ తరహాలో బిల్లులో మార్పులు చేయాలి. అప్పుడే దేశంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే పటిష్ఠ వ్యవస్థ విత్తన చట్టం రూపంలో అందుతుంది. ఇన్నేండ్లు అయినా విత్తన బిల్లు చట్టరూపం దాల్చలేదు. ప్రైవేటు విత్తనసంస్థల ఒత్తిడి దీనికి కారణమన్నది బహిరంగ రహస్యం. ఇప్పటికీ ప్రైవేటు సంస్థలు విత్తన వ్యాపారాన్ని శాసిస్తున్నాయి. దీనికితోడు విత్తన మోసాలు పెరిగాయి. రోజురోజుకూ విత్తన అవసరాలు పెరుగుతున్నాయి. దీంతో బహుళజాతి విత్తనసంస్థలు జన్యుమార్పిడి పంటలతో సిద్ధంగా ఉన్నాయి. విత్తన మోసాలకు గరిష్ఠంగా ఆరు నెలల జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా మాత్రమే. కాబట్టి ఒక్క కల్తీ విత్తనం కూడా విఫణిలోకి రాకుండా సమగ్ర విత్తన చట్టం రావాలి.

వ్యవసాయంలో కీలకమైన విత్తనాన్ని, విత్తనచట్టాన్ని కేం ద్రం తన పరిధిలో ఉంచుకున్నది. వ్యవసాయం మాత్ర మే రాష్ట్ర పరిధిలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం 2004లో రూపొందించిన విత్తన చట్టాన్ని 2010లో కొన్ని మార్పు లు చేసినా ఇప్పటికీ ఆ బిల్లు చట్ట రూపం దాల్చలేదు. ఈ నెల 18 నుంచి మొదలయ్యే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో 2019 విత్తన బిల్లును ప్రవేశపెట్టనున్నది.

ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ రివైజ్డ్ డ్రాఫ్ట్ విత్తన బిల్లు-2019ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దీనిపై సలహాలు, సూచనలు కోరింది.2010లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించిన సిఫార్సులను విత్తన బిల్లు-2019 డ్రాఫ్ట్‌లో కనిపించలేదు. రైతు విత్తనాలు కొని పంట పండించిన తర్వాత ముందుగా విత్తన కంపెనీలు చెప్పిన మేరకు దిగుబడులు రాకపోతే ఆయా విత్తన కంపెనీలు నష్టపరిహారం చెల్లించేలా అవసరమైన కాంపెన్‌సేషన్ కమిటిని నియమించే అధికారాన్ని ఇచ్చే క్లాజు ను తీసివేసింది. అంటే వినియోగదారుల రక్షణ చట్టం-1986 ప్రకారం నష్ట పరిహారం పొందాలని పేర్కొన్నది.

దీనికంటే బిల్లులోనే ప్రత్యేక కాంపెన్‌సేషన్ కమిటీని నియమించే అధికారాలుంటేనే రైతులకు సకాలంలో కచ్చితంగా నష్టపరిహారం అందుతుంది. నాణ్యమైన విత్తనం మాత్రమే సరిపోదు. ఆయా విత్తనాల ధరలు నియంత్రణలో ఉండాలి. రైతు భరించగలిగేలా ఉండాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది.

ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న హైబ్రిడ్ విత్తన ధరలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ఒకసారి ఆ విత్తనాలు మొలకెత్తకపోయినా, పంట నష్టపోయినా మళ్లీ కొని విత్తాలంటే అయ్యే పనికాదు. ప్రస్తుత బిల్లులో విత్తనా ల కొరత, అధిక ధరలు, ధరలలో ఏకఛత్రాధిపత్యం, ఒక ప్రత్యేకమైన రకానికి సంబంధించి ఎక్కువ లాభాలు పొందే పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే విత్తన అమ్మకపు ధరలను నియంత్రించే అధికారాన్ని ఒక కమిటీకి ఇస్తూ బిల్లులో పొందుపరిచారు. కేవలం కొన్ని బహుళజాతి విత్తన సంస్థలు మొత్తం విత్తనరంగాన్ని ప్రపంచవ్యాప్తంగా శాసిస్తున్నా యి.

కాబటి అవి విత్తన చట్టంలోని ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరింతగా ధరలు పెంచే అవకాశం ఉన్నది. కల్తీ విత్తనాలు మార్కెట్‌లో రాజ్యమేలుతున్నాయి. ఒకవేళ పట్టుబడి నా అరకొర పెనాల్టీతో వదిలిపెడుతున్నారనే భరోసా వారికి ఉన్నది. అందుకే 2010లో బిల్లులో సవరణల ప్రకారం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేని లేదా కల్తీ విత్తనాలు లేదా మిస్ బ్రాండెడ్ విత్తనాలు అమ్మినా, నిల్వ చేసినా, దిగుమతి చేసుకున్నా రూ.50 వేల నుంచి పది లక్షల దాకా పెనాల్టీగా వేయాలని కమిటీ సూచించింది.

అలాగే 3 నుంచి 12 నెలల జైలు శిక్ష విధించాలన్నది. అయితే ప్రస్తుతం రూపొందిస్తున్న బిల్లులో పెనాల్టీగా రూ.25 వేల నుంచి ఐదు లక్షల వరకు విధించాలన్నది. గరిష్ఠంగా ఏడాది జైలుశిక్ష విధించాలని పేర్కొన్నది. అయితే ఇవి కంపెనీలను నకిలీ బ్రాండ్ విత్తనాలు అమ్మకుండా నియంత్రించడానికి సరిపో వు.

డ్రాఫ్ట్ బిల్లు ప్రధాన ధ్యేయం విత్తనాల నాణ్యతా నియంత్రణ. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే దేశమంతటా అమలు కానున్నది. ఈ బిల్లు ప్రకారం అన్ని వంగడాల రకాలను రిజిస్టర్ చేయాలి. కనీస ధృవీకరణ విత్తన ప్రమాణాలు పాటించాలి.

విత్తన సంచులు కచ్చితంగా వివరాలను వెల్లడించాలి. జన్యుమార్పిడి విత్తనాలు 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం ఆమోదం తర్వాతే నమోదు చేయబడుతాయి. రైతు హక్కులకు స్థానం కల్పించబడుతుంది. అయితే మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ రాష్ర్టానికి విత్తన చట్టం ఆవశ్యకత చాలా ఎక్కువ.

దేశంలోని 80 శాతానికి పైగా విత్తన కంపెనీలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. నూతన రకాల రూపకల్పన, విత్తనోత్పత్తి ఇక్కడే జరుగుతుంది. ఉమ్మడిరాష్ట్రంలో జరిగినట్లుగానే రాష్ట్రం లో ప్రత్యేక విత్తన చట్టం రూపకల్పనకు ప్రయత్నించినా కేంద్రం ఒప్పుకోలేదు. అయితే రాష్ట్రంలోని రైతులకు కల్తీ విత్తనాల వల్ల నష్టం జరిగితే పరిహారం ఇచే అవకాశాన్ని పత్తి వంటి పంటలకు రాష్ట్రం ఇప్పటికే ప్రత్యే క వ్యవస్థను ఏర్పాటుచేసింది.

కేంద్రం కూడా ఈ తరహాలో బిల్లులో మార్పులు చేయాలి. అప్పుడే దేశంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే పటిష్ఠ వ్యవస్థ విత్తన చట్టం రూపంలో అందుతుంది. 2004లో విత్తన బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం కొన్ని మేలైన సిఫార్సులు చేసింది. రాష్ర్టాల స్థాయిలో విత్తన సంఘం ఏర్పాటుచేయాలి.

విత్తన గరిష్ఠ అమ్మకం ధర ను నిర్ణయించే అధికారం ఇవ్వాలి. రాష్ట్రంలో సాగవుతున్న పంటలలో 60 శాతానికి పైగా (వరి, అపరాలు, మినహా) హైబ్రిడ్లే. పత్తిలో 94 శాతానికి పైగా. వీటిని ప్రైవేట్ సంస్థలు ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తున్నాయి.

ఆయా విత్తనాల వాణి జ్య అమ్మకం ధరలను ఆ సంస్థలే నిర్ణయిస్తాయి. ఎక్కువ మొత్తంలో అసంబద్ధంగా, అశాస్త్రీయంగా, లాభాపేక్షతో ధరలు నిర్ణయించబడుతున్నాయి. కాబట్టి రాష్ట్ర విత్తన సంఘం ఏర్పాటే దీనికి పరిష్కారం. రైతులు, గ్రామాలు సంవత్సరాలుగా కొన్ని వంగడాలను రక్షిస్తూ వస్తున్నారు.

వాటిని హైబ్రిడ్ల అభివృద్ధిలో వాడేటప్పుడు ప్రస్తుతం కంపెనీలు గ్రామాలకు గుర్తింపును ఇవ్వడం లేదు. మద్దతు ధరలకు స్వామినాథన్ సిఫార్సులను అనుసరించినట్లే విత్తన పంటలకు పంట పెట్టుబడి ఖర్చలు పోను 50 శాతం లాభం ఉండేలా విత్తన కంపెనీలు రైతులకు విత్తన పంటలకు ధర చెల్లించాలి. విత్తన కంపెనీలు తమ పంట రకాల గురించి లేబిల్‌పై ముద్రించిన ప్రకారం దిగుబడులు రాకపోతే ఆ నష్టాన్ని విత్తన కంపెనీలే చెల్లించాలి. వీటన్నింటిని ప్రస్తుత బిల్లులో చేర్చాలి.

అప్పుడే సమగ్ర విత్తన చట్టం రూపొందుతుంది. విత్తన కంపెనీలు కోకొల్లలుగా జనక రకాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఆయా దేశాల ఎగుమతిదారులు ఇచ్చే సమాచారం మేరకే వాటిని మన దేశంలోకి అనుమతిస్తున్నారు. గోధుమ జెర్మ్‌ఫ్లాజంతో దేశంలోకి ప్రవేశించిన వయ్యారిభామ కలుపు మొక్కల నివారణ దేశానికి పెద్ద తలనొప్పిగా మారింది.

ప్రభుత్వం పరిశోధన సంస్థలు పూర్తిగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత దిగుమతి చేసుకున్న విత్తనాలను పరిశోధనలకు వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలి. అప్పుడే కొత్తగా చీడపీడల సమస్యలు తలెత్తవు. విత్తనోత్పత్తికి ఎక్కువకాలం అవి అనుకూలంగా ఉంటుంది. రైతులు తాము రూపొందించిన రకాల విత్తనాలను బ్రాండ్ పేరు లేకుండా విఫణిలో అమ్మేందుకు అవకాశం ఉండా లి.

నకిలీ విత్తన విక్రయదారులకు కఠిన శిక్షలు ఉండాలి. బహుళజాతి విత్తన సంస్థలు రావడం వల్ల దేశీయ విత్తనరంగం కుదేలైంది. వాటిని కాపాడుకోవాలి. విత్తన పరిరక్షణలో రైతులకు ఎక్కువ భాగస్వామ్యం కల్పించాలి.

ప్రస్తుతం సంకర రకాలు, జన్యుమార్పిడి రకాల విత్తన ధర లు ఆకాశాన్నంటాయి. సంకరజాతి కాయగూరల విత్తనాల ధరలు కిలో కు లక్షకు చేరింది. కాబట్టి అధిక ధరలు ఉన్న విత్తనాలకు బీమా కల్పించాలి. నష్టపోయిన సందర్భంలో రైతులకు ఇది భరోసా ఇస్తుంది.

దేశంలో నాణ్యమైన విత్తనం అందుబాటులోకి తేవడానికి అనేక చర్య లు తీసుకోబడినాయి. అందులో మొదటిది 1966 భారతీయ విత్తన చట్టం. రకాల ప్రకటన, ధృవీకరణ, లేబిలింగ్‌తో పాటు విత్తన పరీక్షలు ఇందులో ఉన్నాయి. విత్తన డీలర్లకు లైసెన్స్, స్టాకు ప్రదర్శన విత్తన ఆదే శం ద్వారా లభించాయి.

మార్కెట్‌లో రైతుకు లభించే ప్రతి విత్తనానికి వివరాలు తెలిపే లేబిల్ ఉండాలి. అది ధృవీకరణ విత్తనం అయినా కాకపోయినా విత్తన చట్టం క్షేత్రస్థాయిలో అమలుపరుచడానికి విత్తన ఇన్‌స్పెక్టర్లను నియమించే అధికారం ఉన్నది. 1983లోని సీడ్ కంట్రోల్ ఆర్డర్ ద్వారా విత్తనాన్ని నిత్యావసర వస్తువుల జాబితాలోకి చేర్చారు. 1955లోని నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి వచ్చింది.

నల్ల విఫ ణి విత్తన వ్యాపారాన్ని అరికట్టడానికి ఇది ఉద్దేశించింది. 1988లోని విత్తన అభివృద్ధిపై నూతన విధానం ఏర్పాటు ద్వారా స్థానిక విత్తనాలతో పాటు దిగుమతి ద్వారా కూడా నాణ్యతను పెంచే అవకాశం ఉన్న ది. ఆ తర్వాత 2001లో పంటరకాల పరిరక్షణ, రైతుల హక్కుల చట్టం ద్వారా-రైతు విత్తన హక్కులకు భంగం కలుగకుండా నూతన రకాల అభివృద్ధికి ప్రోత్సాహకరమైన అంశాలు అందుబాటులోకి వచ్చాయి. 2004లో విత్తన బిల్లు విత్తన నాణ్యతను పెం చేవి, విత్తన మోసాలను అరికట్టే అనేక మేలైన అంశాలు ఉన్నాయి.

రకాల తప్పనిసరి నమోదు, పరిశీలించడం ద్వారా విత్తన నాణ్యత నిర్ధారణ, విత్తన పరీక్ష కేంద్రాల గుర్తింపు, స్వయం ధృవీకరణ, విత్తనాల ఎగుమతి, దిగుమతుల నియంత్రణ, నమోదు రకాలను రైతులు సాగుచేసి విత్తనంగా వాడుకునే వెసులుబాటు, జరిమానా పెంపు, విత్తనాలపై నియంత్రణలు కచ్చితంగా విత్తనంపై పెత్తనాన్ని తగ్గించే అంశాలు చాలా ఉన్నాయి. అయితే ఇన్నేండ్లు అయినా విత్తన బిల్లు చట్టరూపం దాల్చలేదు. ప్రైవేటు విత్తనసంస్థల ఒత్తిడి దీనికి కారణమన్నది బహిరంగ రహస్యం. ఇప్పటికీ ప్రైవేటు సంస్థలు విత్తన వ్యాపారాన్ని శాసిస్తున్నాయి.

దీనికితోడు విత్తన మోసాలు పెరిగాయి. రోజురోజుకూ విత్తన అవసరాలు పెరుగుతున్నాయి. దీంతో బహుళజాతి విత్తనసంస్థలు జన్యుమార్పిడి పంటలతో సిద్ధంగా ఉన్నాయి. విత్తన మోసాలకు గరిష్ఠంగా ఆరు నెలల జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా మాత్రమే.

కాబట్టి ఒక్క కల్తీ విత్తనం కూడా విఫణిలోకి రాకుండా సమగ్ర విత్తన చట్టం రావాలి. వ్యవసాయం రాష్ట్ర పరిధిలో ఉన్నది. కానీ విత్తనంపై పెత్తనం మాత్రం కేంద్రం పరిధిలో ఉన్నది. కాబట్టి కేంద్రం కొత్తగా తేనున్న చట్టంలో ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని బిల్లు రూపొందించాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*