సమానత్వమే గురునానక్‌ బోధన

గురునానక్‌ సిక్కు మత ప్రారంభకుడు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలను, ఆమోదాన్ని పొం దిన గొప్ప మానవతావాది. అతని బోధనలు హిందూ, ముస్లిం మతాల మాదిరిగా కాకుండా దేవుడొక్కడే అన్నదా న్ని నొక్కి చెప్పాయి. అతను మాత్రమే అంతిమ సత్యం. అతనికి ఎవరినుంచి ఎలాంటి భయంలేదు. అతను కాలా న్ని అధిగమించి సమస్తాన్ని సృష్టించాడు. అతనికి చావు పుట్టుకల్లేవు. ఈ నిజమైన గురు బోధనలతోనే మానవాళి సత్యాన్ని గ్రహించ గలిగింది. మనుషులు మానవీయంగా మసులుకునేందుకు గురునానక్‌ బోధనలే ఆచరణ మార్గం గా నిలిచాయి. మనుషులంతా గురునానక్‌పై భక్తి విశ్వాసాలతోనే సృష్టికర్త అనుగ్రహాన్ని పొందగలుగుతామని తెలుసుకున్నారు. మనిషి అహాన్ని గురునానక్‌ తీవ్రంగా నిరసించాడు. అహమనేది మనిషిపాలిట ప్రథమ శత్రువని బోధించాడు. మనిషి తన అందంతోనే గాక, తన ధనంతో గర్వపడుతున్నాడు. అంతేగాక అతని శక్తిసామర్థ్యాలు, ఉన్నతికి తానే కారణమనుకుంటున్నాడు. అదంతా దేవుడు ప్రసాదించినదిగా గుర్తించనిరాకరిస్తున్నాడు.

అధికుడిని అనే భావనతోనే మనిషి గర్విష్టి అవుతున్నాడు. ఆ గర్వమే అతనికి ప్రతిబంధకంగా మారుతున్నది. ఆత్మవంచనతో అధికుడనే భావనను విడనాడిన నాడే మనిషి ఉన్నతుడవుతాడు. మనిషి ఉన్నతమైన,అర్థవంతమైన జీవన విధానానికి గురునానక్‌ మూడు సూత్రాలు బోధించాడు.

మనం మనకున్న దాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడే ఔన్నత్యం ఒనగూడుతుంది. మనం తినేదాంట్లోనే ఆకలిగొన్నవానికి పం చి ఇచ్చినప్పుడే సార్థకత, ఔన్నత్యం. మనం ఎలాంటి మోసం, దోపిడీ లేకుండా ధనాన్ని సంపాదించాలి. మనిషి ఎల్లప్పుడు సృష్టికర్త పట్ల కృతజ్ఞతతో మెలగాలి.

గురునానక్‌ మనుషుల మధ్య కుల,మత సమానతను బోధించాడు. కుల, మతాల మధ్య వివక్ష ఉండకూడదన్నాడు. మనుషులంతా సమానత్వంతో మెలగాలన్నాడు. గురునానక్‌ దేవుని తర్వాత స్త్రీకే రెండోస్థానం ఇచ్చాడు.

స్త్రీకి జన్మించిన మనిషి స్త్రీకి రుణపడి ఉండాలన్నాడు. స్త్రీని వివాహం చేసుకున్నా, సహచరునిగా చేదోడుగా ఉండాలన్నాడు. ఆ స్త్రీయే రాజులకు, గురువులకు జన్మనిస్తుందన్నది మరువురాదన్నాడు. ఆచారాల పేర మతాలు బోధిస్తున్న క్రతువులు మనిషిని అజ్ఞానిని చేయొద్దని చెబుతూ విగ్రహారాదనను నిరసించాడు. విశ్వమానవులంతా సహోదరులన్న గురునానక్‌ ప్రేమ, నిరాంబరత, సమానత, మానవతతో మెలగాలని ఉద్బోధించాడు. ఈ విలువలను పాటించిననా డే ప్రపంచంలో శాంతి, సౌభాగ్యాలు వెళ్లివిరుస్తాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*