సింధులోయ వారసత్వం

తమిళనాడులోని మధురై సమీపంలో గల కీలడిలో జరిపిన పురాతత్త్వ తవ్వకాలు సింధులోయ వికాసానికి కొనసాగింపుగా దక్షిణాదిన వెల్లివిరిసిన నగర నాగరికతను వెలుగులోకి తేవడం దేశ ప్రజలకు గర్వదాయకం. ఈ తవ్వకాలు కొన్నేండ్లుగా సాగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల మూడవ దశలో వివాదం తలెత్తింది. నాలుగవ దశ తవ్వకాల నివేదికను తమిళనాడు పురాతత్త శాఖ ఈ నెల 19వ తేదీన విడుదల చేసింది. ఈ తవ్వకాల అవశేషాలను వివాదాలకు అతీతంగా అత్యాధునిక పరిశోధనలతో తేల్చిచెప్పారు. భవిష్యత్తులో జరిపే శాస్త్ర పరీక్షలను కూడా ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న సంస్థలతో జరిపించాలని తలపెట్టడం ప్రశంసనీయం. కీలడితో పాటు సమీపంలోని కొంతగాయి, ఆదిచానల్లూరు ప్రదేశాల్లో ఇప్పటికే బయటపడిన, భవిష్యత్తు లో వెలికితీసే మానవ అస్థికల డీఎన్‌ఏ పరీక్షలను జరుపడానికి తమిళనాడు పురాతత్త్వ శాఖ మధు రై కామరాజ్ విశ్వవిద్యాలయంతో, హార్వర్డ్ మెడికల్ స్కూల్‌తో అవగాహన కుదుర్చుకున్నది. ఈ హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన డేవిడ్ రీష్‌కు గతంలో హరప్పా తవ్వకాల్లో బయటపడిన పురాతత్త అవశేషాలను పరీక్ష జరిపిన అనుభవం ఉన్నది. వివాదాలకు అతీతంగా నిష్పక్షపాతం గా, శాస్త్రబద్ధంగా పరీక్షలను జరుపడానికి తమిళనాడు పురాతత్త్వ శాఖ చర్యలు తీసుకోవడం, తవ్వకాలకూ పరిశోధనలకు నిధులను కేటాయించడం అభినందనీయం. తమిళనాడు పురాతత్త్వ శాఖ విడుదల చేసిన నాలుగవ దశ తవ్వకాల నివేదిక ప్రకారం- మధురై సమీపంలోని వైగయి నదీతీరాన వెల్లివిరిసినది సింధులోయ తరువాత మన దేశంలోని రెండవ నగర నాగరికత.

కీలడి తవ్వకాలు చరిత్ర పరిశోధనలో గొప్ప మలుపు అనడంలో సందేహం లేదు.

కానీ ఈ తవ్వకాల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానం వివాదాస్పదమైంది. ప్రముఖ పురాతత్త్వ వేత్త అమర్‌నాథ్ రామకృష్ణ ఆధ్వర్యంలో మొదటి రెండు దశల తవ్వకాలు అద్భుతమైన రీతిలో అనేక అవశేషాలను వెలుగులోకి తెచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఈ కృషిని అభినందించకపోగా రామకృష్ణను అస్సాంకు బదిలీచేసి అనేక రీతుల్లో వేధించింది. స్థానిక పురాతత్త్వ అధికారులతో సంప్రదింపులు జరుపకుండా కట్టడి చేయడంతో పాటు, తుది నివేదిక సమర్పించడానికి అనుమతి ఇవ్వలేదు.

క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలోనే ఇక్కడ గొప్ప నాగరికత నెలకొన్నదనడానికి విస్తారమైన సాంస్కృతిక నిక్షేపాలు లభించాయి. క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దానిదని భావించిన సంగం యుగం కూడా మరో మూడు వందల ఏండ్ల పూర్వపుదని ఈ తవ్వకా ల ద్వారా వెల్లడైంది. ఆనాటి పెంకులపై గల లిపి తమిళ్-బ్రాహ్మి అని శాస్త్ర పరిశోధనల్లో తేలింది. ఇప్పటివరకు సింధులోయ నాగరికతా కాలపు లిపిని చదువలేని పరిస్థితి.

ఇప్పుడు ఆనాటి లిపి కి, ఆ తరువాత కాలపు బ్రాహ్మి లిపికి కీలడి సం కేతాలను వారధిగా చెప్పుకోవచ్చు. ఇక్కడి పెం కులపైనున్న గుర్తులకు, సింధులోయ ప్రాంతపు సంకేతాలకు పోలిక ఉన్నది. క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దం నాడే ఈ ప్రాంతం సాహితీ గుబాళింపులను వెదజల్లింది. ఇక్కడ దొరికిన అస్థికలు ఆవు, బర్రె, గొర్రె, మేక, కృష్ణజింక, అడవి పంది తదితర జంతువులవిగా పుణెలోని డక్కన్ పీజీ, పరిశోధన కేంద్రం తేల్చింది.

ఆనాడు జంతువులను వ్యవసాయానికి ఉపయోగించుకున్నట్టు కూడా భావిస్తున్నారు. వంట పాత్రలు, నీటి గోలాలు మొదలుకొని అనేక వస్తువిశేషాలు బయటపడ్డాయి. ఇటుక గోడలు, నీటి కొలనులు, నీటి సరఫ రా పైపులున్నాయి. రాగి సూది, దారం, కండె, మగ్గాల వంటి ఆధారాల వల్ల కీలడి వస్త్ర పరిశ్రమ కు కేంద్రమని తెలుస్తున్నది.

కొలిమి పరిశ్రమల ఉనికికి సూచిక. ఇటువంటి కొలుములు కూడా కొన్ని బయటపడ్డాయి. వేలాది పురాతత్వ అవశేషాలు ఈ తవ్వకాలలో బయటపడినప్పటికీ, దైవారాధనకు సంబంధించిన వస్తువులేవీ ఇందులో లేకపోవడం గమనార్హం. నాటి సంస్కృతి లౌకికతను ఈ తవ్వకాలు వెల్లడిస్తున్నాయి.

సింధులోయ నాగరికతకు చెందినవారు దక్షిణ భారతానికి వలస వచ్చారనే అభిప్రాయం ఇప్పటికే ఉన్నది. సింధులోయది నగర నాగరికత కనుక వారి వలసను ధ్రువపరిచే నగర ఆనవాళ్ళు దక్షిణాదిన ఇంతకాలం లభించలేదు. కీలడి తవ్వకాల ద్వారా సింధులోయ నాగరికత కొనసాగింపును ఎట్టకేలకు పట్టుకోగలిగాం. కీలడి తవ్వకాలు చరిత్ర పరిశోధనలో గొప్ప మలుపు అనడంలో సందేహం లేదు.

కానీ ఈ తవ్వకాల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానం వివాదాస్పదమైంది. ప్రముఖ పురాతత్త్వ వేత్త అమర్‌నాథ్ రామకృష్ణ ఆధ్వర్యంలో మొదటి రెండు దశల తవ్వకాలు అద్భుతమైన రీతిలో అనేక అవశేషాలను వెలుగులోకి తెచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఈ కృషిని అభినందించకపోగా రామకృష్ణను అస్సాంకు బదిలీచేసి అనేక రీతుల్లో వేధించింది. స్థానిక పురాతత్త్వ అధికారులతో సంప్రదింపులు జరుపకుండా కట్టడి చేయడంతో పాటు, తుది నివేదిక సమర్పించడానికి అనుమ తి ఇవ్వలేదు.

ఈ బృందంలోని మరో 25 మంది అధికారులను కూడా ఇతర ప్రాంతాలకు పంపించింది. మూడవ దశ పరిశోధనలకు అనుమతి ఇవ్వడంలో తాత్సారం చేసింది. నిధులు కూడా మంజూరు చేయలేదు. తమిళనాడు ప్రజలు ఆందోళన చేసి తవ్వకాలు కొనసాగేలా ఒత్తిడి తెచ్చారు.

పీఐఎల్ దాఖలు కావడంతో రామకృష్ణను తిరిగిరప్పించాలని హైకోర్టు ఆదేశించవలసి వచ్చింది. కీలడి నాగరికత ఉత్తర భారతంలోని వేదకాలం కన్నా ముందు నాటిది. ద్రవిడ, లౌకిక సంస్కృతికి నిలయం. అందువల్లనే కేంద్రం వివక్ష ప్రదర్శిస్తున్నదని ఆరోపణలు వస్తున్నాయి. ఉత్తర భారతంలో మాదిరిగా దక్షిణాదిన తవ్వకాలు ఎందుకు జరుపడం లేదని పురాతత్త నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం ఇప్పటికైనా ఈ వివక్ష చూపుతున్న ఆరోపణలకు తావివ్వకూడదు. కీలడి తవ్వకాలకు సంబంధించి తమిళనాడు ప్రజల విజ్ఞప్తులను ఆమోదించాలె.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*