స్విమ్మింగ్ పూల్‌లో శ్రీరెడ్డి.. తాగుతూ, ఊగుతూ అరాచకం!

అరాచకానికి పరాకాష్ట ఏదైనా ఉందంటే ఇదిగో ఇదే అని చెప్పక తప్పరు శ్రీరెడ్డి లేటెస్ట్ స్విమ్మింగ్ పూల్ ఇంటర్వ్యూ చూస్తే..నేనేం పతీవ్రతను కాను అంటూ పదే పదే చెప్పుకునే శ్రీరెడ్డి నిస్సిగ్గుగా మాట్లాడమే కాదు.. అంతకు మించి అని పలు సందర్భాల్లో బహిరంగంగానే రుజువు చేసింది. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంతో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి గత కొన్నాళ్లుగా టాలీవుడ్‌ని వదిలి కోలీవుడ్‌లో ఆఫర్స్ కోసం చెన్నై చెక్కేసింది. తాజాగా హైదరాబాద్‌లో అడుగుపెట్టిన శ్రీరెడ్డి.. తనకు కలిసొచ్చిన వివాదాలతో మళ్లీ అగ్గి రాజేస్తుంది.

ప్రస్తుతం కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వివాదాస్పద మూవీ ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రను పోషిస్తోంది. ఇక చాలా రోజుల తరువాత హైదరాబాద్ తిరిగి వచ్చిన శ్రీరెడ్డి ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి విన్యాసాలు, సిత్రాలు, మాటలు చూస్తే వామ్మో అని నోటి మీద వేలువేసుకోకమానరు.

Read Also: శ్రీరెడ్డి సంచలనం.. ఆ ఫొటో బయటపెట్టేసింది

ఇంటర్వ్యూ కోసం తన ఇంటికి వచ్చిన మీడియా ఛానల్‌కి స్మిమ్మింగ్ ఫూల్‌లో నుండే ఇంటర్వ్యూ ఇచ్చింది శ్రీరెడ్డి. అంతే కాదు చేతిలో మందు గ్లాస్ పెట్టుకుని మరీ కెమెరా ముందు తాగుతూ.. ఊగుతూ.. జలకాలాడుతూ ముచ్చట్లు చెప్పింది. నేను స్నానాలు చేసేటప్పుడు కూడా చూసేస్తారా?.. నాతో మీకూ ఓ జ్యూస్ ఉందేలే.. కాకపోతే అది నేను తాగే జ్యూస్ (వైన్) కాదు మీకు ఆరెంజ్ జ్యూస్ అంటూ స్విమ్మింగ్ ఫూల్‌ జలకాల నుండి బయటకు వచ్చిన శ్రీరెడ్డి.. స్విమ్ డ్రెస్‌లో తడి తడి అందాలతో విపరీతమైన ఎక్స్‌పోజింగ్ ఇచ్చింది.ఇక ఈ హాట్ హాట్ ఇంటర్వ్యూలోని ముచ్చట్లలోకి వెళ్తే.. ‘ఆదివారం కాబట్టి ఏదో సరదాగా ఇలా వైన్ తాగుతున్నా.. టెన్షన్ రిలీఫ్ కోసం ఇప్పుడు కూడా జ్యూస్‌లో మూతి పెడితే ఎలా.. అందుకే వైన్. నేను హైదరాబాద్ వచ్చి పది రోజులు అవుతుంది. తెలుగులో మూడు మూవీస్, తమిళ్‌లో మరో మూవీస్ చేస్తున్నా. ప్రస్తుతానికి బిజీగా ఉన్నా.

ప్రస్తుతం ఏపీ, తెలంగాణ పాలిటిక్స్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉన్నాయి. సినిమాలు కూడా ఇంట్రస్ట్ ఉంది. ఇంతకు ముందు ఓ మచ్చ వేసుకున్నా కదా.. దాన్ని తుడుచుకునే ప్రాసెస్‌లో ఉన్నా. ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ చిత్రం కోసం ఎలాంటి డైట్ ఫాలోకాకుండా ఫుల్‌గా తిని ఒళ్లు పెంచుతున్నా.. ఇంతకు ముందు జీరో ప్యాక్‌తో ఉండేదాన్ని కాని ఈ సినిమాలో పెద్దగా కనిపించాలని కాస్త ఒళ్లు పెంచుతున్నా’ అంటూ బోల్డ్ అండ్ హాట్ ఇంటర్వ్యూ మొదలు పెట్టింది శ్రీరెడ్డి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*