హేల్దీ డైట్ అంటే ఏమిటో మీకు తెలుసా ?

జీవన విధానాన్ని మార్చుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ దాన్ని ఎక్కడనుంచి ఎలా మొదలుపెట్టాలో మాత్రం అర్ధం కాదు. ఆరోగ్యంగా మరియు నిత్య యవ్వనంగా ఉండాలని అనుకునేవాఋ ముందుగా శ్రద్ధ పెట్టవలసినది ఆహారం మీదే. మనం తీసుకునే ఆహారం మన జీవనవిధానాన్ని నిర్దేశిస్తుంది. మిమ్మల్ని అందంగా మరియు ఆరోగ్యంగా ఉంచేది హేల్దీ డైట్ మాత్రమే అని చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు మైక్రో ఓవెన్ లో వండిన ఆహారాలను తీసుకోవటం మానివేయాలి. మైక్రో ఓవెన్ లో వండిన ఆహారంలో పోషక విలువలు నశిస్తాయి. అలాగే కాపీ,కూల్ డ్రింక్ లకు బదులు హెర్బల్ టీ త్రాగటం మంచిది.
ఫాస్ట్ ఫుడ్ కి ముందుగా చెక్ పెట్టాలి
ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకునేవారు ముందుగా చెక్ పెట్టాల్సింది ఫాస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు. పిజ్జాలు,బర్గర్లు,చిప్స్ స్థానంలో గింజలు,తృణ ధాన్యాలు మరియు ఉడికించిన సోయా గింజలు, తాజా కూరగాయలు ముక్కలు,పళ్ళను చేర్చుకోండి.
గోరువెచ్చని నీరు
ఉదయం నిద్ర లేవటం అలవాటు చేసుకోండి. అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ముఖం కడుక్కొని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని త్రాగాలి.
బ్రేక్ ఫాస్ట్
గోరువెచ్చని నీటిని త్రాగిన వెంటనే వ్యాయామం చేయాలి. కనీసం అరగంట వ్యాయామం చేయటం మంచిది. అనంతరం బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి. బ్రేక్ ఫాస్ట్ లో నానబెట్టిన తృణ ధాన్యాలు మరియు రెండు ఇడ్లీలను తీసికున్న తర్వాత కాపీ,టీ లకు బదులుగా పల్చని మజ్జిగ లేదా తాజా పండ్ల రసం త్రాగాలి.
వ్యాయామం
ఆహారంలో మార్పులు, చేర్పులు చేసుకున్నంత మాత్రాన పూర్తి ఆరోగ్యం చేకూరుతుందని అనుకోకండి. రోజులో కొద్ది సమయం వ్యాయామంనకు తప్పనిసరిగా కేటాయించాలి.
మిడ్ మార్నింగ్ (ఉదయం పది నుంచి పదకొండు మధ్య)
రెండు ఫ్యాట్ లేని బిస్కెట్స్, ఒక పండు తీసుకొంటే మంచిది.
లంచ్
కార్బో హైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఆహారంతో పాటు మీగడ తీసిన పెరుగు లేదా కూరగాయల జ్యూస్ తీసుకోవాలి.
స్నాక్స్
మధ్యాహ్నం లంచ్ కి,రాత్రి డిన్నర్ కి మద్య సమయంలో తేలికపాటి స్నాక్స్ తీసుకోవాలి.
డిన్నర్
లంచ్ కన్నా తక్కువ మొత్తంలో డిన్నర్ ను తీసుకోవాలి. అదీ నిద్ర పోవటానికి రెండు గంటల ముందు డిన్నర్ ను పూర్తి చేయాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*