అనారోగ్యంతో బాధపడుతున్న పవన్‌ కల్యాణ్‌

జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ గురువారం మధ్యాహ్నం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియా ద్వారా  ఈ విషయాన్ని చెబుతూ.. గబ్బర్‌ సింగ్‌ షూటింగ్‌లో వెన్నుమొకకు తగిలిన గాయం మళ్లీ ఎక్కువ అయినట్లు తెలిపారు.ఈ కారణంగానే విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరుకాలేకపోతున్నానని అన్నారు. మీడియా స్వేచ్చ కోసం చేస్తున్న ఈ పోరాటానికి తన మద్దతు ఉంటుందన్నారు. అయితే తనకు తలెత్తిన ఈ సమస్యకు వైద్యం తీసుకుంటున్నందున మూడు రోజుల పాటు ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*