ఆమే నా విమర్శకురాలు: రవిశాస్త్రి

టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి తన తల్లి లక్ష్మి శాస్త్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. బుధవారం రవిశాస్త్రి తల్లి లక్ష్మి 80వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా రవిశాస్త్రి తన తల్లి​కి బర్త్‌డే విషెస్‌ తెలిపాడు. ‘నా మార్గనిర్దేశకురాలు, అతి పెద్ద విమర్శకురాలు మా అమ్మే. హ్యపీ బర్త్‌డే మామ్‌. గాడ్‌ బ్లెస్‌ యూ’అంటూ ట్వీట్‌ చేశాడు. అంతేకాకుండా తన తల్లితో దిగిన ఫోటోను కూడా జత చేశాడు. అంతేకాకుండా సోషల్‌ మీడియా వేదికగా రవిశాస్త్రి తల్లికి నెటిజన్లు కూడా బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*