డీల్‌ కుదిరింది.. రేపో మాపో ప్రకటన?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2020 కోసం ప్రాంచైజీలు, ఆటగాళ్లు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నారు. కోచ్‌, ఆటగాళ్ల మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దికోవాలని ఆటగాళ్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాంచైజీలు తమను పక్కకు పెట్టక ముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ జాబితాలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు కింగ్స్‌ పంజాబ్‌ సారథి రవిచంద్రన్‌ అశ్విన్‌. గత సీజన్‌లో అశ్విన్‌ సారథ్యంలో పంజాబ్‌ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అంతేకాకుండా ఆటగాడిగా కూడా అశ్విన్‌ ఎలాంటి మ్యాజిక్‌ చేయలేదు. దీంతో అశ్విన్‌తో పనేంటి అని పంజాబ్‌ భావిస్తున్నట్లు, అంతేకాకుండా అతడిని జట్టు నుంచి సాగనంపేందుకే రంగం సిద్దమైనట్లు అనేక వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా అశ్విన్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఒప్పందం జరిగిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని విశ్వసనీయ సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*